Samantha : ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా ఒకటో రెండో హిట్స్ అందుకున్నాక రెమ్యునరేషన్ పెంచుతారు. కానీ సమంత మాత్రం ఏకంగా సినిమాల్లో నటించక ముందే తన రెమ్యునరేషన్ తో దర్శక నిర్మాతలను భయపెట్టిందిట. స్టార్ డెరెక్టర్ కూడా ఆమె దెబ్బకు హడలెత్తి ఫ్లైయిట్ ఎక్కించేశారు.
సమంత (Samantha) తొలి చిత్రం ఏదంటే? ఆమె అభిమానులే కాదు సినీ ప్రియులంతా ‘ఏమాయ చేసావె’ (Ye Maaya Chesave) అని ఠక్కున సమాధానమిస్తారు. ఆ సినిమాకంటే ముందు ఆమె మరో చిత్రానికి ఆడిషన్ ఇచ్చారనే సంగతి మీకు తెలుసా? ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు.. శివ నాగేశ్వరరావు. 2009లో కొత్త నటులతో ఆయన.. ‘నిన్ను కలిశాక’ (Ninnu Kalisaka) అనే సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం సమంతనూ ఆయన ఆడిషన్ చేశారట. అంతా ఓకే అనుకునే సమయానికి సమంత చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారుట.
దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఆమె ఆడిషన్ చాలా బాగుందని, అయితే పారితోషికం ఎక్కువగా అడిగారని, అది తమ సినిమా బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో హీరోయిన్‌గా తీసుకోలేదని శివ నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పుడే ఆమె అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని ఆయన ప్రశంసించారు. సినిమాలో అవకాశం ఇవ్వలేమని చెప్పడంతో సమంత వెంటనే చెన్నై వెళ్లిపోవాలని గోల చేశారట. విమాన ఖర్చులు అధికమైన ఆమె గోల తట్టుకోలేక చెన్నై విమానం ఎక్కించేశారుట.
అలా ఆ అవకాశం మిస్ అయిన సమంత.. ‘ఏమాయ చేసావె’ సినిమాతో తెరంగేట్రం చేసింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలై సంచలనం సృష్టించింది. తొలి చిత్రమే సూపర్‌హిట్‌కావడంతో సమంతకు వరుస అవకాశాలు వచ్చాయి. అటు అగ్ర కథానాయకులతో, ఇటు యంగ్ హీరోలతో ఆడిపాడి తనదైన ముద్ర వేసింది. ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam) ఆమె కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది.