టాలీవుడ్ లో ఎలాంటి జానర్ సినిమాలో అయిన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలిగే సత్తా ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు విక్టరీ వెంకటేష్. మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ తోనే సూపర్ హిట్ ని కొట్టి గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ మాస్ చిత్రాలు, ఫ్యామిలీ జానర్ చిత్రాలు , ఎంటర్టైన్మెంట్ జానర్ చిత్రాలు ఇలా అన్నీ జానర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అని అందుకొని అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోలలో ఒకడిగా మారాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఉన్నంత క్రేజ్ గడిగిన నాలుగు దశాబ్దాలలో ఏ హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.

ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ ని చాలా దగ్గరగా చూసిన అనుభవం ఉన్న రామానాయుడు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది బాగా తెలుసు. వాళ్ళని పెళ్లి చేసుకోవడం అసలు లేదట రామానాయుడికి. ఎందుకంటే పెళ్ళైన హీరోయిన్స్ అందరూ రెండు మూడు నెలలు తిరగకుండానే విడాకులు తీసేసుకుంటున్నారు.

అలాంటి పరిస్థితి తన కొడుక్కి రాకూడదని నీరజా అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాడు. అలా సినిమాల్లోకి రాకముందే వెంకటేష్ కి పెళ్లి అయ్యింది. అయితే వెంకటేష్ కు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదట. ఇండస్ట్రీ లో ముందు హీరో గా స్థిరపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడట. కానీ రామానాయుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదట , అలా వెంకటేష్ కి ఇష్టం లేకుండానే పెళ్లి జరిగింది అని అంటుంటారు.
