Mahesh Babu : కొంతమందికి కొన్ని సినిమాలు ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన సినిమాలు కొన్ని ఉంటాయి. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగిన ఆ హీరోలకు ఒక్క సినిమాతో సూపర్ స్టార్ స్టేటస్ కి చేరిపోతుంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు కి ‘పోకిరి’ చిత్రం అలాంటిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
మహేష్ బాబు లో ఇంత ఊర మాస్ యాంగిల్ ఉందా అని ఆయన అభిమానులే ఆశ్చర్యపోయేలా చేసిన చిత్రం ఇది. అప్పట్లోనే 80 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి ఆల్ టైం సెన్సేషనల్ సౌత్ ఇండియన్ రికార్డు గా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా మహేష్ కి ఎంత ప్లస్ అయ్యిందో, కెరీర్ కి అప్పట్లో అంతే మైనస్ అయ్యింది కూడా.
‘పోకిరి’ ఇమేజి కారణంగా అప్పట్లో మహేష్ బాబు ఏ సినిమా చూసిన ఆడియన్స్ పోకిరి సినిమాతో పోల్చి చూసేవారు. అంచనాలు ఆ రేంజ్ ని అందుకోకపోవడం తో మహేష్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేవి. సైనికుడు, అతిధి మరియు ఖలేజా చిత్రాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం పోకిరి సినిమా అని మహేష్ బాబు కూడా ఎన్నో సందర్భాల్లో తెలిపాడు.
ఈ మూడు సినిమాలు కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం మితిమీరిన అంచనాలే. ఈ మూడు సినిమాలకు కలిపి అప్పట్లో వచ్చిన నష్టాలు 60 కోట్ల రూపాయిల పైమాటే అని ట్రేడ్ పండితులు చెప్పే మాట. ఈ మూడు సినిమాల తర్వాత ‘దూకుడు’ చిత్రం వచ్చింది. ఈ సినిమాతో ఆయన పోకిరి ఇమేజి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.