Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ ని చెయ్యలేదు అనే విషయం చాలా మంది అభిమానులకు అర్థం కానీ ప్రశ్న. చిన్న కూతురు శ్రీజా కి సినిమాల్లో నటించడం పై ఆసక్తి లేదు.

కానీ పెద్ద కూతురు సుస్మిత కి మాత్రం సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది అట. అప్పట్లో ఈమె ప్రముఖ హీరో ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అదంతా పక్కన పెడితే అంతకు ముందే ఈమె సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని కోరుకుంది అట. చిరంజీవి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలి సినిమా లాంచింగ్ కి సిద్ధం గా ఉన్న రోజులవి.

అయితే అప్పట్లో ఒక టాలీవుడ్ యంగ్ హీరో సుస్మిత మీద మనసు పడ్డాడు. ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ప్రతీ రోజు పిచ్చి పిచ్చి మెసేజీలు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఈ విషయం ఇంట్లో చెప్తే పెద్ద గొడవ అవుతుందని ఆమె ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంది అట. దాంతో ఆ హీరో ఈమె ఏమి చెయ్యలేదనే ధైర్యం తో ఇంకా రెచ్చిపోయి ఫోన్ కాల్స్ మరియు మెసేజిలు పెడుతూ ఉండేవాడట. ఇక ఆమెలో సహనం కోల్పోయి నేరుగా వెళ్లి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి విషయం మొత్తం చెప్పేసిందట.

పవన్ కళ్యాణ్ కోపం తో అప్పుడు అతని ఇంటికి వెళ్లి చితకబాదాడు అని అప్పటి మీడియా లో ఒక పెద్ద రూమర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఇలా ఉంటే, ఇక ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో అని భయపడి సుస్మిత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వలేదట. కానీ ఈమె జై చిరంజీవ సినిమా నుండి చిరంజీవి కి వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వస్తుంది. ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది.