Supritha : ఆ యాంకర్ తో సుప్రిత ప్రేమలో పడిందా?

- Advertisement -

Supritha : తెలుగు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి అందరికి తెలుసు.. తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తుందో తెలిసిందే.. హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరో వార్త షికారు చేస్తుంది.. ఓ యాంకర్ తో Supritha పీకల్లోతూ ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ వార్తల పై తల్లీ కూతుర్లు స్పందించకపోవడంతో నిజమేనని జనాలు అనుకుంటున్నారు..

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటిస్తూ హీరో హీరోయిన్ లకి అక్క,అత్త, క్యారెక్టర్లలో నటిస్తూ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి..ఇక ఐదు పదుల వయసు దాటినా కూడా తన అందచందాలతో అందరినీ ఎప్పటికప్పుడు ఫిదా చేస్తుంది. ఇక అప్పుడప్పుడు ఆమె వేసే డ్రెస్ ల వల్ల చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది..

తన భర్త చనిపోవడం వల్ల ఆమె వేసే డ్రెస్ లకు ఆమెను చాలా మంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా జీ తెలుగులో ఓ రెండు ప్రేమ మేఘాలు అనే షో ఆదివారం రోజు రానుంది.ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోగ్రాం లో యూట్యూబర్ నిఖిల్ సింహ సురేఖ వాణి కూతురు సుప్రీత ఇద్దరు ప్రేమికులుగా కనిపించారు.

- Advertisement -

అయితే వీళ్ళని చూసిన చాలా మంది వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారా అని కామెంట్లు పెడుతున్నారు.. ప్రదీప్ షో ఓ రెండు ప్రేమ మేఘాలు అనే షోలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేస్తూ వారిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు.. మీరిద్దరూ ఎక్కడ కలిశారు.. ఎప్పుడు కలిశారు..అని అడగగా మేము కరోనా లాక్ డౌన్ లో కలిసాము అని చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది రియల్ లవ్వా? లేక ఫేక్ లవ్వా? తెలియాలంటే ఆ షోను తప్పక చూడాల్సిందే..

Supritha

ఇక సురేఖ వాణి, ఆమె కూతురు మోడరన్ డ్రెస్సులలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. అయితే, వాటిని పట్టించుకోకుండా వాళ్ల దారిలో వాళ్ళు వెళ్తుంటారు. అయితే చాలా రోజుల నుండి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. దాని గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు..అయితే తాజాగా,నిఖిల్ సింహ, సుప్రీతల జోడి బాగుండడంతో చాలామంది వీరు నిజంగానే ప్రేమించుకున్నారు కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే వాళ్ళు చెప్పేవరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here