అందం అనే పేరు కి పర్యాయ పదం లాగ ఉండే బ్యూటీ ఐశ్వర్య రాయ్.ప్రతీ కుర్రాడి కలల రాకుమారి ఆమె, ఐశ్వర్య రాయ్ లాంటి ప్రేయసి తమ జీవితం లోకి రావాలని, ఐశ్వర్య రాయ్ లాంటి అందగత్తె తమకి భార్య గా రావాలని కోరుకుంటూ ఉంటారు. ఏ అమ్మాయి అయినా అందంగా కనిపిస్తే, ఆమె అందాన్ని వర్ణించడం కోసం ఐశ్వర్య రాయ్ తో పోలుస్తారు, బహుశా ఇలాంటి హీరోయిన్ మళ్ళీ పుట్టాడేమో అనిపించేంత సొగసరి ఈ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్.
కేవలం అందం లోనే కాదు, అభినయం లో కూడా ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఈ వయస్సులో కూడా ఆమెని అందం లో డామినేట్ చేసే హీరోయిన్ ఇండస్ట్రీ రాలేదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందం పరంగా , అభినయం పరంగా ఆమెకి ఎలాంటి వంకలు పెట్టలేము, కానీ అప్పట్లో ఈమె బాలీవుడ్ హీరోలతో నడిపిన అఫైర్స్ గురించి మీడియా కథలు కథలుగా చెప్పుకునేది.
ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తో ప్రేమాయణం నడిపింది, వివేక్ ఒబెరాయ్ ఐశ్వర్య రాయి ని ప్రేమించినందుకు సల్మాన్ ఖాన్ అతనికి ఫోన్ చేసి బెదిరించాడని, ఆయన సినీ కెరీర్ ని సర్వనాశనం చేసాడని బాలీవుడ్ లో ఒక రూమర్ ఉంది. వివేక్ ఒబెరాయ్ తో ఎవరైనా సినిమా ఒప్పుకుంటే ఆ నిర్మాతకి ఫోన్లు చేసి బెదిరించి క్యాన్సిల్ చేయించేవాడట. అప్పట్లో ఐశ్వర్య రాయ్ ని ప్రేమించినందుకు నా కెరీర్ ని సర్వనాశనం చేస్తానని సల్మాన్ ఖాన్ బెదిరించినట్టు మీడియా ముందుకి వచ్చి సంచలన కామెంట్స్ చేసాడు వివేక్ ఒబెరాయ్.
మీ ఇద్దరి గొడవలో నన్ను ఎందుకు లాగుతున్నారని ఐశ్వర్య రాయ్ వివేక్ ఒబెరాయ్ పై ఫైర్ అయ్యి బ్రేకప్ చెప్పిందట. సల్మాన్ ఖాన్ బెదిరింపుల వల్ల వివేక్ ఒబెరాయ్ కి ఏకంగా పది సినిమాలు క్యాన్సిల్ అయ్యాయట. ఇక ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమెని పెళ్ళాడినందుకు గాను సల్మాన్ ఖాన్ అభిషేక్ బచ్చన్ సినీ కెరీర్ ని కూడా నాశనం చేసాడని చెప్తుంటారు, అలా ఐశ్వర్యారాయ్ మీద కన్నుపడింది ప్రతీ ఒక్కరికి సినీ కెరీర్ లేకుండా చేసాడట సల్మాన్ ఖాన్.