Renu Desai : భద్రి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగింది వారి కాపురం. ఆ తర్వాత కారణమేందో తెలియదు కానీ ఆయనతో విడిపోయి దూరంగా ఉంటుంది. పవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. ఆమె అభిమానులు ఎన్నాళ్ల నుంచో వెండి తెరపై కనిపించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటికి వారి కోరికను రేణు నెరవేర్చారు. ఇన్నేళ్ల తర్వాత రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో తానో కీలక పాత్రతో వెండితెరకు కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు.

ఈ సందర్భంగా రేణు దేశాయ్ తాను పుట్టినప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎలా లింగ వివక్షకు గురయ్యారో చెప్పుకొచ్చారు. తన పేరెంట్స్ అబ్బాయి పుట్టాలని కోరుకున్నారట… కానీ అమ్మాయి పుట్టేసరికి కాస్త అప్ సెట్ అయ్యారట. చాలామంది తన పెళ్లి, విడాకుల గురించి మాట్లాడుకుంటూ ఇబ్బందిపెడుతుంటారు. నాకు ఇలాంటి ఇబ్బందుకలు కొత్తేమీ కాదు. కానీ చిన్న వయసు నుంచే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపింది. తనకు మదర్స్ డే వస్తే చాలు.. తన బాల్యమే గుర్తుకు వస్తుందని.. ఆమె పుట్టిన తరువాత మూడు రోజుల వరకు తన తండ్రి.. ముఖాన్ని చూడడానికి ఇష్టపడలేదని.. కారణం అమ్మాయిగా పుట్టడమే అని తెలిపింది.

ఈ విషయం తనకు తన తల్లి చెప్పినప్పుడు చాలా బాధేసిందన.. ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉండిపోయిందని తెలిపింది రేణు దేశాయ్.. ఆ వెంటనే ఒక ఏడాదిలో తనకి తమ్ముడు పుట్టాడని వాడీని మాత్రం చాలా గారాభంగా.. రాజులా పెంచారని తెలిపింది. ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తాను ఎలాంటి పరిస్థితులలో పెరిగానో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. తన విడాకుల విషయం కంటే..కూడా ఆ విషయమే తనని చాలా బాధ పెట్టిందని.. ఇలాంటి తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారని.. వాళ్ల కడుపులో పుట్టడం నా దురదృష్టకరమని పేర్కొంది.