Rajinikanth : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఒక సాధారణ బస్సు కండక్టర్ గా జీవనం ప్రారంభించి సౌత్ ఇండియా లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ ప్రస్థానం ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, ఆ తర్వాత విలన్ గా పలు సినిమాల్లో నటించి, చివరికి హీరో గా స్థిరపడ్డాడు.

ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న రజినీ కాంత్ ని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా నిల్పిన చిత్రం ‘బాషా’. తమిళం లో ఈ చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో, తెలుగు లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గ్యాంగ్ స్టర్ రోల్స్ కి ఈ సినిమా ఒక పుస్తకం లాగ నిల్చింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఆ చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తొలుత రజినీకాంత్ తో చెయ్యాలని అనుకోలేదట. ఈ కథతో ముందుగా ఆయన మెగాస్టార్ చిరంజీవి తో చేద్దాం అని అనుకున్నాడట. తెలుగు మరియు తమిళం భాషల్లో చిరంజీవి తోనే ఏకకాలం లో నిర్మించాలని అనుకున్నాడట. అల్లు అరవింద్ కూడా ఈ సినిమా చిరంజీవి తో చెయ్యడానికి చాలా ప్రయత్నాలే చేసాడట.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల చిరంజీవి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత రజినీకాంత్ కి ఈ కథని వినిపించగా, సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసాడట. అలా చిరంజీవి వదులుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రజినీకాంత్ ని సౌత్ ఇండియా లోనే అతి పెద్ద సూపర్ స్టార్ ని చేసింది. ఒకవేళ చిరంజీవి ఈ సినిమాని ఒప్పుకొని చేసి ఉంటే ఆయన కూడా ఇదే రేంజ్ మార్కెట్ లో ఉండేవాడేమో.