Actor Surya : ప్రస్తుతం ఇండియా లో అందరికంటే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి మాత్రమే. #RRR చిత్రం తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటుగా విదేశీ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసి, ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకొని, ఎవ్వరికీ అందనంత ఎత్తులో మన టాలీవుడ్ ని తీసుకెళ్లి పెట్టాడు. ఇక నుండి రాజమౌళి సినిమాలు కేవలం ఇండియా లో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో, ఇతర భాషల్లో కూడా విడుదల అవుతాయి.

ఆయన సినిమాల కోసం అందరూ అంతలా ఎదురు చూస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు తో చెయ్యబోతున్న సినిమా అలాగే ఉంటుంది. పాన్ వరల్డ్ చిత్రం గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చెయ్యబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న రాజమౌళి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో తియ్యబోతున్నాడు అనేది నిన్న మొన్నటి వరకు అందరిలో మెలిగిన ప్రశ్న. ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని, లేదు రామ్ చరణ్ తో చేయబోతున్నాడని, ఇలా పలు రకాల వార్తలు షికారు చేసాయి. ఇవి రెండు కాకుండా మహాభారతం చెయ్యబోతున్నాడు అనే వార్త కూడా వినిపించింది. కానీ ఇవేమి కాకుండా, మహేష్ తో సినిమా పూర్తి అవ్వగానే రాజమౌళి సూర్య తో సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ‘మగధీర’ సినిమా తర్వాత సూర్య తనతో సినిమా తియ్యాల్సిందిగా రాజమౌళి కి భారీ మొత్తం లోనే అడ్వాన్స్ ఇచ్చాడట.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి #RRR చిత్రాన్ని ముందుగా రామ్ చరణ్ మరియు సూర్య కాంబినేషన్ లో చేద్దాం అనుకున్నాడు. కానీ అది చివరికి ఎన్టీఆర్ కి వెళ్ళింది. #RRR తర్వాత అయినా సూర్య తో సినిమా చెయ్యాలని అనుకుంటే, మహేష్ బాబు రిక్వెస్ట్ తో ఆయన సినిమాకి కమిట్ అయ్యాడు. అందుకే తదుపరి చిత్రం మాత్రం సూర్య కి చేసి పెట్టాల్సిందేనని, ఇప్పటికే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ కి వడ్డీనే కోట్ల రూపాయిలు అయ్యుంటాడని రాజమౌళి తన సన్నిహితులతో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
