Prabhas : టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే మన అందరికీ భారీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలే గుర్తుకు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఊర నాటు నేటి తరం మాస్ హీరో గా ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆయన కటౌట్, ఆ కటౌట్ కి తగ్గ ఫైట్స్ ని చూసి ఫ్యాన్స్ అయినవాళ్లు సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
అలాంటి మాస్ ఇమేజి ఉన్న ప్రభాస్ తో లవ్ స్టోరీ చెయ్యాలని ఏ డైరెక్టర్ అయినా సాహసం చేస్తాడా..?, ముఖ్యంగా ప్రభాస్ కి అయితే లవ్ స్టోరీస్ అంటే అసలు ఇష్టం ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ రెండవ చిత్రం ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా ముందుగా ప్రభాస్ చెయ్యాల్సి ఉంది. రాజమౌళి ఈ స్టోరీ వినిపించిన వెంటనే, ఈ కటౌట్ కి ఇంత క్లాస్ స్టోరీ ఎలా సెట్ అవుతుంది అనుకున్నావ్ డార్లింగ్ , నాకు అసలు నచ్చలేదు స్టోరీ అని ముఖం మీదనే చెప్పేశాడట.
ఇప్పటికీ రాజమౌళి సినిమాల్లో ఆయనకీ నచ్చని సినిమా ఏదైనా ఉందా అంటే, అది స్టూడెంట్ నెంబర్ 1 అనే చెప్తుంటాడు ప్రభాస్. అలాంటి ప్రభాస్ తో మహేష్ బాబు డార్లింగ్ లాంటి సినిమా చేయించాడట. కేవలం మహేష్ బాబు ఇచ్చిన సలహా వల్లే ఈ సినిమా చేసాడట ప్రభాస్. అప్పట్లో డైరెక్టర్ కరుణాకరన్ మహేష్ బాబు తో డార్లింగ్ సినిమా చెయ్యాలని కథ వినిపించడానికి వెళ్ళాడట.
మహేష్ బాబు ఈ కథ విన్న తర్వాత ‘కెరీర్ ప్రారంభం లోనే ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసి ఆ స్టేజి దాటి వచ్చేసాను..ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, ఈ కథ నాకంటే ప్రభాస్ కి బాగుంటుంది. అతను ఇప్పటి వరకు మాస్ సినిమాలే చేసాడు, ఇది ఆయనకీ ఒక మేక్ ఓవర్ లాగ ఉంటుంది’ అని చెప్పి పంపాడట. ప్రభాస్ ఈ స్టోరీ చెయ్యడానికి మొదట ఒప్పుకోలేదట, ఆ తర్వాత మహేష్ బాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడడం తో మనసు మార్చుకొని ప్రభాస్ ఈ చిత్రం చేసాడు. ఫలితం ఎలా వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి యూత్ లో క్రేజ్ ఏర్పడింది.