Pooja Hedge : స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే తెలుగు సినీ పరిశ్రమకు ముకుందా చిత్రంతో పరిచయమయ్యింది. ఆమె అలవైకుంఠపురం తో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత అరవింద సమేత, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా మారిపోయింది.
అయితే తాజాగా డిప్రెషన్ తో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, అని ఒక వార్త చెక్కరలు కొడుతోంది. ఈ మధ్య కాలంలో ప్లాప్ లు పూజ హెగ్డేని పలకరించాయి. ఈ కారణంగా ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం చిత్రం నుండి ఆమె తప్పుకుందని, అంతేకాకుండా టాలీవుడ్ లో ఆమెకు దర్శక నిర్మాతలు హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర డిప్రెషన్ లోకి పూజా హెగ్డే వెళ్లిందట. ఈ కారణంగానే ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని సినీ క్రిటిక్ ఉమైర్ సందు తన సామాజిక మాధ్యమ ఖాతాలో ట్వీట్ చేశారు.
నిన్న మధ్యాహ్నం పూజ హెగ్డే సూయి సైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ ఇంట్లో వాళ్ళు చూడటం వల్ల బతికి బయటపడింది, అంటూ ఉమైర్ సందు ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఆమె సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది, ఈ విషయం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఏదైనా ప్రకటన చేస్తారేమో ముందు ముందు చూడాలి, అంటూ ఆయన సంచలనాత్మకమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్లో వైరల్ అవ్వడంతో, ఇది కొంతమంది నిజమని భావిస్తే, మరి కొంత మంది సందు ఎప్పుడు సినీ ప్రముఖులపై రూమర్లు క్రియేట్ చేస్తూ ఉంటాడు, అంటూ కామెంట్ చేస్తున్నారు.