Pawan Kalyan మన టాలీవుడ్ లో అన్నీ క్రాఫ్ట్స్ మీద పట్టు ఉన్న హీరోలలో ఒకడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక మంచి పేరుంది. కెరీర్ ప్రారంభం లోనే ఈయన కేవలం 7 సినిమాలకే డైరెక్టర్ అయ్యాడు. తమ్ముడు, ఖుషి,బద్రి వంటి సినిమాలకు పవన్ కళ్యాణ్ దర్శకత్వ విభాగం లో సాధ్యమైనంత వరకు తన సలహాలను ఇచ్చేవాడు. అవి అప్పట్లో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.

ఇదంతా పక్కన జానీ తర్వాత పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ‘గుడుంబా శంకర్’. ఈ చిత్రానికి వీర శంకర్ అనే వ్యక్తి దర్సకత్వం వహించినట్టు ఆయన పేరు వేస్తారు కానీ, నిజానికి ఆయన పేరుని వేసి, వెనుక నుండి దర్శకత్వం వహించింది మొత్తం పవన్ కల్యాణే. ఈ సినిమా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఈ స్క్రీన్ ప్లేకి కాస్త హీరోయిజం ని జత చేసి శ్రీను వైట్ల తన కెరీర్ మొత్తాన్ని నెట్టుకొచ్చాడు. ఆయన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి నెంబర్ 1 రేస్ లో నిలబెట్టిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘దూకుడు’ అనే చెప్పాలి. మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది. మగధీర రికార్డ్స్ ని కొట్టడం అప్పట్లో సినిమాలకు చాలా పెద్ద ఛాలెంజ్.

కానీ దూకుడు సినిమా మొట్టమొదటి సారి మగధీర సినిమా వసూళ్లకు చాలా దగ్గరగా వెళ్ళింది. ఓవర్సీస్ లో అయితే మన తెలుగు సినిమాకి మార్కెట్ ని తీసుకొచ్చింది దూకుడు సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే కి ఆదర్శం ‘గుడుంబా శంకర్’ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఒకానొక ఇంటర్వ్యూ లో శ్రీను వైట్ల కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాడు.
