Samantha – Naga Chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత , నాగ చైతన్య పేర్లు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. పేరుకి వీళ్లిద్దరు విడిపోయారు కానీ, అభిమానులు మాత్రం వీళ్లిద్దరు విడిపోయినట్టు చూడడం లేదు. సమంత కి నాగ చైతన్య అంటే ఇప్పటికీ పిచ్చి ఇష్టం అని ఆమె మాట్లాడే మాటల్లో చూస్తే అర్థం అయిపోతుంది. ఆయన పేరు వినగానే ఆమె ముఖం లో మార్పులని మనం గమనించొచ్చు.

తెలియకుండానే ఆమె గొంతులో బాధ వచ్చేస్తాది, అందుకే ఆమె అక్కినేని నాగచైతన్య పేరుని నా ముందు ప్రస్తావించొద్దు అని ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ కి ముందుగా చెప్తూ ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం సమంత పేరు ని ప్రస్తావించడానికి ఏమాత్రం వెనుకాడడు. ఆమె టాపిక్ వచ్చినప్పుడల్లా ఆమె గురించి ఎంతో గొప్పగా మాట్లాడడం మనమంతా చూసాము. కానీ సమంత మాత్రం అప్పట్లో ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాం లో నాగ చైతన్య గురించి చాలా తప్పుగా మాట్లాడింది.

కరణ్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నువ్వు మీ మాజీ భర్త ఇప్పుడు ఒకే రూమ్ లో ఉంటే, ఏమి చేస్తావు’ అని అడగగా, సమంత చంపేస్తాను అని సమాధానం చెప్తుంది. నాగచైతన్య గురించి అంత తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా అతనేమీ పట్టించుకోలేదు, పైగా సమంత ఒక ఫైటర్ అని, ఏ పని అయినా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదని, చాలా మంచి అమ్మాయి అంటూ ఎన్నోసార్లు గొప్పగా చెప్పాడు.

అంతే కాకుండా ఆమెకి మయోసిటిస్ వ్యాధి సోకినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ చాలా కేరింగ్ గా ఉండేవాడట. ఇలా విడిపోయిన తర్వాత కూడా సమంత కి నాగ చైతన్య అనేక విషయాల్లో అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎలాగో మళ్ళీ కలిసి ఉండలేరు, కనీసం కలిసి సినిమా అయినా చెయ్యండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.