Manchu Lakshmi : ఆ వ్యక్తి కారణంగానే మంచు లక్ష్మి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందా ?

- Advertisement -

Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండి తెర, బుల్లితెరపై రాణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనగనగా ఒక ధీరుడు సినిమాతో వైవిధ్యమైన పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ కెరీర్ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ భామ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ క్రేజ్‌ సంపాదించుకుంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే ఆమె మొదటి భర్త గురించి ఓ వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే తన కాలేజ్ మేట్ అయిన లండన్ శ్రీనివాస్‌ను ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకుంది. వాళ్ళ ప్రేమ వివాహాన్ని మంచు మోహన్ బాబు ఒప్పుకోలేదు. దీంతో తన భర్తకు ఎక్కడ ఉద్యోగం దొరకకుండా ఏడాది పాటు చాలా ఇబ్బందులు పెట్టాడట. అంతేకాదు అతని కుటుంబ సభ్యులను, బంధువులను రౌడీలను పెట్టి బెదిరించాడట. అయితే ఆయన బెదిరింపులు భరించలేక ఓసారి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చిన మంచు లక్ష్మి మళ్లీ.. ఆయన ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదట. ఎంత ప్రయత్నించినా ఆమె మళ్లీ తిరిగి రాలేకపోయిందట. దాంతో లండన్ శ్రీనివాస్ అప్పటి పోలీసుల నుంచి ముఖ్యమంత్రి వరకు మొరపెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదట.

- Advertisement -

చివరికి తన భర్తకు తన వల్ల ముప్పు ఉంది.. కాబట్టి ఇక ఆ పెళ్లికి అర్థం లేదని మంచు లక్ష్మి అతడితో విడిపోయింది. ఇండియాలోనే ఉంటే తన మనసు మళ్లీ మారుతుందని మంచు మోహన్ బాబు, లక్ష్మిని అమెరికా పంపించి థియేటర్ కోర్సు నేర్పించారట. అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడిందని తెలియగానే తీసుకొచ్చి ఆండ్రీ శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here