Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నిన్న రాత్రి విడుదలై ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎంతసేపు అందరూ మహేష్ వింటేజ్ కామెడీ టైమింగ్ గురించి, మాస్ యాంగిల్ గురించి మరియు ట్రైలర్ లో ఆయన చూపించిన స్వాగ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ వస్తున్నారు కానీ, ఈ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని బోలెడన్ని విషయాలు దాగున్నాయి.
ఒక్కమాట లో చెప్పాలంటే త్రివిక్రమ్ రెండు గంటల 40 నిమిషాల సినిమాని, కేవలం రెండు నిమిషాల 40 సెకండ్ల టీజర్ లో చూపించేసాడు. కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్ మరియు ఎమోషన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసిన పర్ఫెక్ట్ సంక్రాంతి ప్యాకేజి గా ఈ సినిమా ఉండబోతుంది అని చూపించేసాడు. కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి.
అంతే కాకుండా ఈ ట్రైలర్ ద్వారా డైరెక్టర్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి ఒక పెద్ద హింట్ ఇచ్చేసాడు. అదేమిటంటే చిన్నతనం లో మహేష్ బాబు కంటికి నిప్పు అంటుకోవడం మనం ట్రైలర్ ప్రారంభం లో చూసే ఉంటాము. దాని ప్రభావం కారణంగా మహేష్ బాబు కి ఒక కన్ను కనిపించదు. అందుకే మహేష్ ట్రైలర్ లో ఎక్కువ సార్లు ఒక కన్ను మూసి చూస్తుంటాడు.
అది ఆయనకి ఈ సినిమాలో ఉన్న లోపం, దానిని కూడా మ్యానరిజం లెక్క మార్చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే ఇప్పుడు హైలైట్ గా మారింది. కేవలం ట్రైలర్ లోనే కాదు, దీనికి ముందు విడుదల చేసిన ‘ఆ కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ లో కూడా మహేష్ బాబు ఒక కంటి తో చూస్తాడు. అది మ్యానరిజం అని అందరూ అనుకున్నారు కానీ, అది మహేష్ లో ఉన్న లోపం అని నిన్న ట్రైలర్ చూసాకనే అర్థం అయ్యింది.