టాలీవడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. నూనూగు మీసాలు కూడా రాని చిన్న వయస్సు లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, ఆ చిన్న వయస్సులోనే కనీవినీ ఎరుగని రేంజ్ మాస్ బ్లాక్ బస్టర్స్ ని కొట్టి ఇండస్ట్రీ లోకి వచ్చిన మూడేళ్లలోపే తిరుగులేని మాస్ స్టార్ గా ఎదిగాడు.
చిన్నతనం లోనే మాస్ ఇమేజి రావడం తో ఎలాంటి స్క్రిప్ట్స్ ని ఎంచుకోవాలి అనేది ఎన్టీఆర్ కి అర్థం అయ్యేది కాదు, దాని వల్ల ఆయన చాలా కాలం ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ తానూ ఎక్కడ విఫలం అవుతున్నాను అనే విషయాన్నీ గమనించిన ఎన్టీఆర్, తనని తాను సరిదిద్దుకొని మళ్ళీ నెంబర్ 1 రేస్ లోకి దూసుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా ఆయన 2011 వ సంవత్సరం లో లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరికీ పెళ్ళై 12 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ 12 ఏళ్ళు వీళ్లిద్దరు ఎంత అన్యోయంగా ఉంటూ వచ్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరి దాంపత్య జీవితం కారణం అభయ్ రామ్ మరియు తారక్ రామ్ అని ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. వీళ్లిద్దరు సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇన్నాళ్ల వీళ్ళ దాంపత్య జీవితం లో లక్ష్మీ ప్రణతి కి ఎన్టీఆర్ లోని ఒక ముఖ్యమైన క్వాలిటీ అసలు ఇష్టం ఉండదట. ప్రతీ చిన్న విషయానికి ఎన్టీఆర్ కి కోపం వచ్చేస్తుందని, ఈ హైపర్ అంటే లక్ష్మీ ప్రణతి కి చాలా చిరాకు అని తెలుస్తుంది. కొన్ని కొన్ని సార్లు గొడవలు అయినప్పుడు ఆమె తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయేదట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ లో ఉన్న ఈ షార్ట్ టెంపర్ లక్షణం వల్ల లక్ష్మీ ప్రణతి చాలా బాధ పడేదని అప్పట్లో ఒక టాక్ ఉండేది.