Krithi Shetty : ప్రస్తుతం యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కృతి శెట్టి పేరు కచ్చితంగా ఉంటుంది. ‘ఉప్పెన’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన కృతి శెట్టి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకి కేవలం ఒకటి రెండు చిత్రాలు తప్ప పెద్దగా సక్సెస్ లు రాలేదు.

రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడం తో ప్రస్తుతానికి ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు కరువు అయ్యాయి. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడే శ్రీలీల కూడా క్లిక్ అవ్వడం, ఆమెకి వరుసగా ఆఫర్స్ రావడం కూడా కృతి శెట్టి కి పెద్ద మైనస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె శర్వానంద్ మరియు శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. యాంకర్ కృతి శెట్టి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సినిమాల్లోకి రాకముందు మీరు ఏమి జాబ్ చేసేవారు’ అని అడుగుతుంది. అప్పుడు కృతి శెట్టి దానికి సమాధానం చెప్తూ ‘నేను సినిమాల్లోకి రాకముందు ఇంటి పనులు ఎక్కువ చేసేదానిని, మా అమ్మ బిజీ గా ఉన్న సమయం లో నేనే మార్కెట్ కి వెళ్లి గ్రాసరీస్ ని తెచ్చేదానిని. అలా తీసుకొచ్చినందుకు మా అమ్మ నా కష్టాన్ని గుర్తించి 100 లేదా 150 రూపాయిలు ఇచ్చేది. ఇదే నా మొదటి జాబ్, ఇదే నా మొదటి జీతం’ అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ఈ విషయం ని తెలుసుకున్న నెటిజెన్స్, ఇంటి పనులు చెయ్యడానికి కూడా డబ్బులు తీసుకున్న ఏకైక మనిషివి నువ్వే అంటూ కృతి శెట్టి ని ట్యాగ్ చేసి ఫన్నీ కామెంట్స్ చేసారు.
