Sneha : హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది స్నేహ. చక్కటి రూపం .. అంతకుమించిన మంచి మనసు.. ఎవరినైనా ప్రేమగా పలకరించే గుణం.. స్నేహ సొంతం. అందుకే సినిమా ఇండస్ట్రీలో స్నేహకు చాలామంది స్నేహితులు అయ్యారు. మరీ ముఖ్యంగా హోమ్లీగా కనిపించే స్నేహ అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ పడి చచ్చిపోతూ ఉంటారు. ఆమె చీర కట్టి తలలో పూలు పెట్టి నుదుట బొట్టు పెట్టింది అంటే అచ్చం తెలుగింటి మహాలక్ష్మి లాగే ఉంటుందంటూ పొగిడేస్తూ ఉంటారు.

కాగా, సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ లేడీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన స్నేహ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ స్నేహ బెల్లీఫ్యాట్ సర్జరీ చేయించుకోబోతుందట. పిల్లల పుట్టిన తర్వాత ఆమెకు పొట్ట బాగా పెరిగిపోయిందట. ఆ కారణంగానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మళ్లీ తన కెరీర్ ని సక్సెస్ బాటలో పెట్టడానికి హీరోయిన్ స్నేహ తన బాడీని ట్రాన్స్ ఫామ్ చేయించుకుంటుందట.

ఇప్పటికే రకరకాల ఎక్ససైజులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. స్నేహ ఇలాంటి నిర్ణయం తీసుకుందట. అయితే చాలామంది స్నేహ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. నెట్టింట్లో అయితే ఆమెను ఏకంగా బూతులు తిడుతున్నారు. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. నీకు ఇలాంటి ఆపరేషన్ అవసరమా ..? అంటూ స్నేహను ట్రోల్ చేస్తున్నారు . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.