Chiranjeevi : జనవరి 12 వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ స్టార్ హీరోలు సైతం అందుకోలేని నంబర్స్ ని పెడుతున్న చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జ హీరో గా నటించిన ఈ సినిమా ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.
ఒక చిన్న సినిమా పెద్ద సినిమాలను సైతం డామినేట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి వెళ్లడం మనం 2022 వ సంవత్సరం లో ‘కాంతారా’ అనే చిత్రానికి చూసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు హనుమాన్ చిత్రానికే చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్, వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయిలను కచ్చితంగా వసూలు చేస్తుంది అని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఈ స్థాయి బ్లాక్ బస్టర్ స్టేటస్ రావడానికి ముఖ్య కారణం మెగా స్టార్ చిరంజీవి అట. ముందుగా ఈ సినిమాలో ‘ఆంజనేయ స్వామి’ పాత్ర కోసం చిరంజీవి ని సంప్రదించాడట డైరెక్టర్ హనుమాన్. కథ మొత్తం విన్న తర్వాత చిరంజీవి ‘ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి పాత్ర చెయ్యడానికి సరిపోను. నాకు అంత కటౌట్ లేదు. ఆంజనేయ స్వామిని వెండితెర మీద చూస్తే ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చెయ్యాలి.
అలా చెయ్యాలంటే ప్రస్తుతం ఎవరిదో ఒకరి ప్రముఖ హీరో కళ్ళను, శరీర సౌష్టవం కి సంబంధించిన ఫోటోల్లను తీసుకొని, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆడియన్స్ కి గూస్ బంప్స్ మొమెంట్స్ ని రప్పించవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి’ అని చిరంజీవి చెప్పాడట. చిరంజీవి చెప్పినట్టుగానే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాటించాడు, ఫలితం అదిరిపోయింది. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.