Chiranjeevi : సాధారణ మధ్యతరగతి కుటుంబం లో పుట్టి, స్వయంకృషి తో ఎదిగి, తెలుగు సినిమా ఇండస్ట్రీ ని నాలుగు దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కూర్చొని శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ప్రతీ ఒక్కరికి ఒక ఆదర్శం అని చెప్పడం లో కొత్తేమి లేదు, అది ప్రతీ ఒక్కరికి తెలిసిందే. కృషి, పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత ఎత్తుకు అయినా ఎదగొచ్చు, కన్న కలలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ ఆయన. కేవలం సినీ రంగం లోనే కాదు, చిరంజీవి ఏ రంగం లో ఉన్నా ఇదే విధమైన శ్రద్ద భక్తులతో ముందుకు సాగుతాడు. మరి రాజకీయ రంగం లో రాణించలేకపోయాడు కదా అంటే, దానికి కొన్ని ప్రత్యేకపరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన 8 నెలలు లోపే ప్రత్యర్థి పార్టీలకు సమానమైన పోటీ ని ఇచ్చి 18 శాతం కి పైగా ఓటు షేర్ ని దక్కించుకుంది.
అన్నీ ప్రాంతాలలో కూడా ఈ పార్టీ త్రికోణపు వాతావరణం ని తీసుకొచ్చింది అంటే అది చిరంజీవి కృషి, పట్టుదల వల్లే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన విద్యాబ్యాసం లో ఉన్నప్పుడు కూడా ఉన్నతంగానే రాణించాడట. సినిమాల్లోకి రాకపొయ్యుంటే చిరంజీవి కూడా తన తండ్రిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరేవాడని అనేక సందర్భాలలో చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో చిరంజీవి 10 వ తరగతి సర్టిఫికెట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఈ సర్టిఫికెట్ లో కేఎస్ వరప్రసాదరావు అని ఉండడాన్ని మనం గమనించొచ్చు.
అలాగే తండ్రి పేరు వెంకట్రావు అని, చిరంజీవి పుట్టిన స్థలం పెనుగొండ అని వివరాలు ఉన్నాయి. కానీ ఈ సర్టిఫికెట్ లో చిరంజీవి కి ఎన్ని మార్కులు వచ్చాయి అనే ప్రస్తావన మాత్రం లేదు. అయితే సీనియర్ మెగా ఫ్యాన్స్ ని ఆరతియ్యగా అప్పట్లో చిరంజీవి తన సెకండరీ విద్యాబ్యాసం ని ఫస్ట్ గ్రేడ్ లోనే పాస్ అయ్యి పూర్తి చేసారని తెలుస్తుంది. దీనిని బట్టీ చిరంజీవి ఏ స్థాయి విద్యార్థి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆగస్టు నెలతో 70 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న చిరంజీవి, ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటూ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది.