Niharika : రీసెంట్ సమయం లో ఏ సెలబ్రిటీ కి జరగని రేంజ్ లో పెళ్లి వేడుకలను జరుపుకున్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా అంటే అది నిహారిక కొణిదెల పెళ్లి అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు. వీళ్లిద్దరి వివాహం ని తండ్రి నాగబాబు భారీ ఖర్చు తో రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇప్పటికీ వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అంత ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయింది అనే వార్త మెగా ఫ్యాన్స్ ని బాగా డిస్టర్బ్ చేసింది. చూసేందుకు చిలకా గోరింకలు లాగ చాలా చక్కగా ఉన్నారు కదా, పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకోవడం ఏమిటి?, పెళ్లి అనే మహోన్నత వ్యవస్థని ఈ సెలెబ్రిటీలు నాశనం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెదవి విరిచారు.

ఇది ఇలా ఉండగా మొట్టమొదటిసారి నిహారిక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన విడాకుల గురించి చెప్పుకొచ్చింది. నమ్మి మోసపోయాను అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. నిహారిక ని వివాహం చేసుకున్న తర్వాత భర్త చైతన్య కి టాలీవుడ్ లో కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి అని, అలా కొంతమంది హీరోయిన్స్ తో చైతన్య క్లోజ్ గా ఉండేవాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

అలా ఒక యంగ్ హీరోయిన్ తో తనకి తెలియకుండా పార్టీలకు, పబ్బులకు వెళ్లడం, సీక్రెట్ టూర్స్ వంటివి వెయ్యడం నిహారిక కి తెలిసింది అట. విషయం ఏమిటో కనుక్కుందాం అని విచారిస్తే అతను ఆ యంగ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని తెలిసింది. అందుకే ఆమె చైతన్య తో గొడవలు పడి బయటకి వచ్చేసిందట. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని నిహారిక ని యాంకర్ ఒక ప్రశ్న అడగగా, నా వయస్సు కేవలం 30 ఏళ్ళు మాత్రమే, నేనెందుకు పెళ్లి చేసుకోను?, కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకుంటా అని సమాధానం ఇచ్చింది.
