ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్, అందరి హీరోలు లాగ కాకుండా కామెడీ జానర్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న హీరో అల్లరి నరేష్. ‘అల్లరి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా ఈయన అతి తక్కువ సమయం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించి, మర్చిపోలేని రేంజ్ పాత్రలు పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.

కేవలం కామెడీ పాత్రలు మాత్రమే కాకుండా, సీరియస్ జానర్ సినిమాలు మరియు యాక్షన్ జానర్ సినిమాలు కూడా చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గతం లో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చిన్నప్పుడు ఆయన ఎలాంటి చిలిపి వేషాలు వేసేవాడో చెప్పుకొచ్చాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

చిన్నతనం లో అల్లరి నరేష్ ఎక్కువగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడేవాడట. ఆయన తండ్రి బలవంతంగా మనోడిని హాస్టల్ కి పంపిస్తే అక్కడి నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడట. ఒక రోజు ఈవీవీ సత్యనారాయణ ‘అబ్బాయి గారు’ అనే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయం ఎక్కడ జరుగుతుంది ఏమిటి అనేది అన్నీ నరేష్ కి తెలుసు అంట.

ఒకరోజు దోబీ కి వచ్చిన అతనితో మాటలు కలిపి , మా నాన్న పెద్ద డైరెక్టర్, ఆయన సినిమాలో నీకు ఆఫర్ ఇప్పిస్తా, నేను ఇచ్చే ఈ బట్టలు ఆయనకీ ఇచ్చేసి రా అని అంటాడు. అప్పుడు ఆ బట్టలలో ఆయన ‘నేను ఇక్కడ ఉండలేకున్నాను.. వచ్చేస్తున్నా’ అని ఏడుపు ఎమోజి పెట్టి పంపించాడట. అల్లరి నరేష్ ఇలా చిన్నప్పుడు స్నేహితులతో గొడవలు పడినప్పుడు కూడా , నేనెవరినో తెలుసా.. మా నాన్న పెద్ద డైరెక్టర్ అని చెప్పుకుంటూ తిరిగేవాడట అల్లరి నరేష్.