Nagarjuna : నాగార్జునకి అలాంటి కండీషన్ పెట్టిన నాగేశ్వరరావు.. ఇప్పటికీ ఆయన నాన్న మాట దాటడట

- Advertisement -

Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఇప్పటికీ అక్కినేని అనే పదానికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇప్పటికి ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబ సభ్యులకు ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు సినిమాల కోసం పడ్డ కష్టమనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చిన నాగార్జున సైతం అదే విధంగా ఆయన పేరును ట్రెండ్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య అఖిల్ మాత్రం అక్కినేని పేరుని పై స్థాయికి తీసుకుని రాలేకపోతున్నారు.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో ఎప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాడో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోయిన్లతో చాలా జోవియల్ గా .. సరదాగా మూవ్ అయ్యే నాగార్జున ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోయిన్లతో సినిమాలు చేశారు. కానీ ఓ హీరోయిన్ తో మాత్రం నటించలేదు. ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయినా సరే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన వద్దంటూ రిజెక్ట్ చేశాడట. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు హీరోయిన్లతో ఎంత దూరమైనా వెళ్తారు. ఎలాంటి సీన్లలోనైనా నటిస్తారు. అస్సలు మొహమాట పడకుండా నటించి ప్రేక్షకులను మెప్పించగలరు. కానీ నాగార్జున మాత్రం ఓ హీరోయిన్ తో నటించనని చెప్పడానికి కారణం అక్కినేని నాగేశ్వర రావు అట.

- Advertisement -

అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ఆ హీరోయిన్ తో నటించకూడదంటూ కండీషన్ పెట్టాడన్న వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆ హీరోయిన్ కి అక్కినేని ఫ్యామిలీకి ఏంటి శత్రుత్వం..?.. అంతే కాదు నాగచైతన్యతో తల్లి పాత్రలో నటించడానికి వచ్చినా కూడా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట ఆ హీరోయిన్. దీంతో ఆ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అసలు విషయం ఏంటనేది మాత్రం బయటకు తెలియడం లేదు. మరొకసారి ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here