Akkineni Nagarjuna : నిన్నటి తరం స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన తోటి స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ లో దూసుకుపోతుంటే, నాగార్జున మాత్రం ప్రయోగాత్మక చిత్రాలతో ఇండస్ట్రీ లో హిట్స్, సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ దూసుకుపోయాడు. ఈయన సాధించిన విజయాలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు కూడా దక్కింది. హిందీ, తమిళం భాషల్లో కూడా అప్పట్లో నాగార్జున సినిమాలు బాగా ఆడేవి.

ఇదంతా పక్కన పక్కిన పెడితే నాగార్జున కి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందరూ ఈయనని మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు. ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలతో సరిసమానంగా గ్లామర్ ని మైంటైన్ చెయ్యడం నాగార్జున స్టైల్. హీరోయిన్స్ లో కూడా ఈయనకి ఉన్న ఫాలోయింగ్ మరో స్టార్ హీరోకి లేదు.
సినిమాల్లోకి రాకముందే ఆయన దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మి ని వివాహమాడాడు. కొంతకాలం దాంపత్య జీవితం గడిపిన తర్వాత కొన్ని విబేధాల కారణం గా విడిపోయి తన తోటి హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమల తో పెళ్ళైన తర్వాత కూడా నాగార్జున టబుతో ప్రేమాయణం నడిపాడని అప్పట్లో ఇండస్ట్రీ లో ఒక రూమర్ సంచలన సృష్టించింది.

ఇప్పటికీ వీళ్లిద్దరు ఎంతో స్నేహం గా ఉంటారు. అయితే ఆమె వల్ల అమల కి నాగార్జున కి మధ్య ఎలాంటి విబేధాలు రాలేదు. కానీ అనుష్క విషయం లో మాత్రం ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అని ఇండస్ట్రీ లో అప్పట్లో ఒక టాక్ వినిపించేది. నాగార్జున హీరో గా నటించిన సూపర్ చిత్రం ద్వారానే అనుష్క ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఆమె నాగార్జున తో కలిసి ‘డాన్’, ‘రగడ’ ,’డమరుకం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇంకా అనేక నాగార్జున సినిమాల్లో ఆమె స్పెషల్ రోల్స్ మరియు ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ వచ్చింది. ఇన్ని సినిమాల్లో కలిసి నటించేలోపు వీళ్లిద్దరి మధ్య కూడా ప్రేమాయణం నడిచింది అని, అనుష్క వల్ల నాగార్జున అమల కి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, నాగార్జున అమల కి విడాకులు ఇచ్చి అనుష్క ని మూడవ పెళ్లి చేసుకోబోయాడని, కానీ మెగాస్టార్ చిరంజీవి జోక్యం తో ఈ సమస్య సర్దుకుందని అప్పట్లో ఒక రూమర్ ప్రచారం అయ్యింది.

అయితే అప్పట్లో ఈ రూమర్స్ పై అనుష్క చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి నాగార్జున గారు నాకు ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ లాంటి వాడు, అలాంటి వ్యక్తికీ నాకు ఇలాంటి సంబంధం అంతబెడుతారా?, అసలు మీరు మనుషులేనా అంటూ అనుష్క ఫైర్ అయ్యింది.