Actor Arjun : కూతురి నిశ్చితార్థం రింగ్ కోసం అర్జున్ అన్ని లక్షలు ఖర్చు చేశాడా..? ఆ రింగ్ లో ఉన్న స్పెషాలిటీ చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Actor Arjun : తెలుగు , కన్నడ , తమిళం మరియు మలయాళం భాషల్లో హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు యాక్షన్ కింగ్ అర్జున్. ఒకప్పుడు ఈయన సినిమాలు తమిళం లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ తో పోటీ పడేవి. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు ఉండే సినిమాలు చేసి యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.

Actor Arjun
Actor Arjun

ప్రస్తుతం అన్నీ ప్రాంతీయ భాషల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా రాణిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అర్జున్ కి ఐశ్వర్య అనే కూతురు ఉంది. ఈమెని ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయం చేసి చాలా కాలం అయ్యింది. కానీ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతూనే ఉంది. దీంతో ఆమెకి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నాడు అర్జున్. రీసెంట్ గానే నిశ్చితార్ధ వేడుకని అంగరంగ వైభవంగా జరిపించాడు అర్జున్.

Actor Arjun  Daughter

ప్రముఖ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి తో ఐశ్వర్య పెళ్లి ఫిక్స్ అయ్యింది. రీసెంట్ గానే కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షం లో నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంత కాలం నుండి ప్రేమలో మునిగి తేలుతున్న ఐశ్వర్య మరియు ఉమాపతి ఎట్టకేలకు ఒకటి అయ్యారు.

- Advertisement -
Actor Arjun Engagement

ఇకపోతే ఈ నిశ్చితార్ధ వేడుక లో ఐశ్వర్య ధరించిన దుస్తులు , వేసుకున్న నగలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నిశ్చితార్ధ రింగు గురించి పెద్ద ఎత్తున నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నిశ్చితార్ధ రింగు 5 క్యారెట్ గోల్డ్ తో బ్లడ్ రూబీ రంగుతో తయారు చేయించారట. ఈ రింగ్ ని బర్మా దేశం నుండి తెప్పించారట, దీని విలువ అక్షరాలా 20 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here