Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో అనుకోకుండా ఓ చిక్కులో ఇరుక్కున్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు విషయంపై క్లారిటీ తీసుకుని.. జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే?
హీరో ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర.. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది. కాగా ధనుష్ కొడుకు వయసు కేవలం 15 ఏళ్లే. అలాంటిది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా.. వాళ్లు నివసిస్తున్న పోయస్ గార్డెన్ ఏరియాలో బైక్ నడిపాడు. దాన్ని ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ట్రాఫిక్ పోలీసుల దగ్గరకు వెళ్లింది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు బైక్ పై ఉన్నది ధనుష్ కొడుకా కాదా అనేది తెలుసుకోవడానికి.. అతడి ఇంటికి వెళ్లి కన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయితే బైక్ పై ఉన్నది యాత్ర అని తెలుసుకున్న పోలీసులు రూ. 1000 జరిమానా విధించారు. మరోవైపు.. స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది.