Janhvi Kapoor : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘దేవర’ మెలోడీ సాంగ్..దేవకన్యలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!

- Advertisement -

Janhvi Kapoor : పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 90 శాతం పూర్తి అయ్యింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటని విడుదల చెయ్యగా, ఆ పాటకి ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ , తమిళం లో కూడా ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ చిత్రం నుండి ‘చుట్టంలా’ అనే మెలోడీ పాటని విడుదల చేసారు. ఈ పాటకి కూడా ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

Image

ముఖ్యంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడి చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంది. అలాగే జాన్వీ కపూర్ అందచందాలను చూసి కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు. ఇన్ని రోజులు ఇండస్ట్రీ కి రాకుండా ఎందుకు ఉన్నావ్, బాలీవుడ్ లో నీకు హిట్స్ లేకపోయియుండొచ్చు కానీ, టాలీవుడ్ లో నిన్ను ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని తిరిగేవాళ్లు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పాటలో జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసింది అనే చెప్పాలి. మనకి మొదటి నుండి తెలిసిందే, ఎన్టీఆర్ ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ లో కాస్త వీక్ అని. ఈ సాంగ్ లో కూడా ఆయన అలాగే అనిపించాడు.

- Advertisement -
Janhvi Kapoor
Janhvi Kapoor

లుక్స్ పరంగా పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాడు కానీ, రొమాంటిక్ సాంగ్ లో కూడా ఆయన సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం, ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టు ఫోజులు పెట్టడం కాస్త ఇబ్బందిని కలిగించాయి. ఓవరాల్ గా సాంగ్ కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ, మొదటి సాంగ్ రీచ్ ని అందుకుంటుందా లేదా అనేదే చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో టీం మొత్తం యమబిజీ గా గడుపుతుంది.

Image

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here