Devara : ‘ దేవర ‘ మళ్ళీ వాయిదా పడిందా?.. ఏంటి కొరటాల మామ ఇది..

- Advertisement -

గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రీకొడుకుల పాత్రలో నటిస్తున్నాడు.. ఇక దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమా పార్ట్ 1ను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా షూటింగ్ ఆలస్యం కావడంతో దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది..

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. ఈ సమయంలోనే దేవర సినిమాను కూడా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమా విడుదల వాయిదా అధికారిక ప్రకటన రాబోతున్నట్లు వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

- Advertisement -

 

ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది.. మూడోసారి అవ్వడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.. కొరటాల పై మండిపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 2025లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పార్ట్ 2 గురించి అయితే ఇప్పటివరకూ పెద్దగా చర్చ లేదు. దేవర పార్ట్ 1 రిలీజ్‌పైనే అందరి దృష్టి ఉంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.. అటు బాలీవుడ్ లో కూడా వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే రెండూ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతుంది..

 

Ntr, devara movie, koratala siva, movie updates, latest news

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here