Hyper Adhi : జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకొని నేడు ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయి కమెడియన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు హైపర్ ఆది. జబర్దస్త్ షో కి ప్రస్తుతం తాత్కాలిక విరామం ఇచ్చాడు కానీ, ఢీ మరియు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ మాత్రం చేస్తున్నాడు. సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ హైపర్ ఆది ఈటీవీ లో టెలికాస్ట్ అయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ని మాత్రం వదలడం లేదు.

ఆయన వదలాలి అని అనుకున్నా కూడా ఈటీవీ వారు మరియు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు వదలనిచ్చేలా లేరు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ ఈటీవీ ని వదిలేసిన తర్వాత హైపర్ ఆది నే మెయిన్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఆయన లేకపోతే వచ్చే ఆ కాస్త రేటింగ్ కూడా పడిపోతుందని భయం. ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది అంటే దానికి కారణం హైపర్ ఆది అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందరూ హైపర్ ఆది పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది ఒక్కసారి ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకొని శ్రీ దేవి డ్రామా కంపెనీ సెట్స్ మీదకి తీసుకొని వస్తాడు. నిజంగా పెళ్లి చేసుకున్నాడేమో అనుకోకండి, అది కేవలం స్కిట్ మాత్రమే.

ఈ స్కిట్ లో హైపర్ ఆది ‘నేను చాలా ఒత్తిడి కి లోను అయ్యాను..ఒక హాగ్ ఇవ్వు అని ఆ అమ్మాయిని అడుగుతాడు’. అప్పుడు ఆమె వెంటనే హాగ్ ఇస్తుంది. అలా హైపర్ ఆది చిక్కింది ఛాన్స్ అని మాటికొస్తే ఆ పదాలను వాడుతూ హగ్గులు మీద హగ్గులు తీసుకుంటూ ఉంటాడు. ఇది కామెడీ కి చేసినప్పటికీ చూసే ఆడియన్స్ మొత్తంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది.
