Deepika Padukone : తనకు పిల్లలు కావాలని ఇటీవల వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇప్పుడు గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దీపికా తల్లి కాబోతోందని దీపిక సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు ది వీక్ పేర్కొంది. అంతేకాకుండా, ఆమె ఇప్పుడు గర్భం రెండు నెలల గర్భవతి అని నివేదిక పేర్కొంది.
దీపికా పదుకొణె కల నెరవేరుతుందా?
ఇటీవల, దీపికా పదుకొణె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.. కచ్చితంగా. ణ్‌వీర్ కు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా సొంత ఫ్యామిలీని ప్రారంభించే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం” అని దీపిక తెలిపింది. మరి ఈమె తన ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి. అయితే ఇంతలోనే దీపిక తల్లి కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల, ఆమె BAFTA అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతగా పాల్గొంది. కానీ ఈ నివేదికలో చెప్పినట్లు, ఆమె తన రెండు ట్రైమెస్టర్ లో ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపారు. అయితే.. వచ్చే వర్షాకాలంలో దీపికా ప్రసవించే అవకాశం ఉందని కూడా ది వీక్ రిపోర్ట్ పేర్కొంది.
2018లో రణవీర్ సింగ్, దీపికా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వారి తర్వాత పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్ రణబీర్, అలియా ఇప్పటికే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. రణ్‌వీర్, దీపికలు మీకు శుభవార్త ఎప్పుడు చెబుతారని తరచుగా అడుగుతుంటారు. అయితే ఎట్టకేలకు దీపిక తల్లి కాబోతోంది అనే వార్త బాలివుడ్ వర్గాల్లో సంచలనం రేపుతుంది. BAFTA అవార్డుల కార్యక్రమంలో ఆమె చాలా సన్నగా కనిపించిందని అయితే కొద్దిరోజుల్లోనే దీపిక తల్లి కాబోతుంది అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో కీలకంగా మారింది. నెటిజన్స్ అయితే దీపి తీపి కబురు చెప్పింది కానీ.. క్లారిటీ మాత్రం ఎప్పుడు ఇస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.
BAFTAలలో చీరలో దీపికా హోయల్
దీపికా పదుకొణె బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (బాఫ్టా) అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హాజరయ్యారు. అయితే అక్కడ హాలీవుడ్ నటీమణుల మాదిరిగా గౌన్లు ధరించకుండా మెరిసే లేత గోధుమరంగు చీరలో అద్భుతంగా కనిపించింది. అదే చీరలో వీపు చూపిస్తూ కెమెరాకు పోజులిచ్చి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రీసెంట్ గా హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ మూవీలో నటించిన దీపికా పదుకోన్.. ప్రభాస్ తో కలిసి నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది. ఇవే కాకుండా.. బ్రహ్మస్త్ర 2, సింగం అగైన్ సినిమాలూ చేస్తోంది. మరోవైపు రణ్‌వీర్ తన నెక్ట్స్ మూవీస్ డాన్ 3, శక్తిమాన్, సింగం అగైన్ లతో బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు దీపికా తల్లి కాబోతోందన్న వార్తల నేపథ్యంలో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. ఈ వార్తలపై సెలబ్రిటీ జంట ఇంకా స్పందించలేదు.