Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. 50 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కేవలం నాలుగు రోజుల్లోనే 47 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.నాని కి ఇంత భారీ వసూళ్లు ఒకప్పుడు ఫుల్ రన్ లో కూడా వచ్చేవి కాదు, అలాంటిది ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లోనే ఇంత భారీ మొత్తం వసూళ్లు రావడాన్ని చూస్తుంటే ఆయన రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే నాని ఈ సినిమాని కేవలం తెలుగు ఆడియన్స్ కోసం తియ్యలేదు. పాన్ ఇండియన్ మూవీ లవర్స్ కోసం తీసాడు, ఇక్కడ ఈ రేంజ్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా ఇతర బాషలలో మాత్రం కనీస స్థాయి ఓపెనింగ్ ని కూడా దక్కించుకోలేకపోయింది.

ముఖ్యంగా హిందీ లో ఈమధ్య మన తెలుగు నుండి విడుదలైన చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తున్నాయి. బాలీవుడ్ పాపులర్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ కూడా అద్భుతమైన రేటింగ్స్ ఇచ్చారు. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్, అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నాలుగు రోజులకు కలిపి కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయిందట. ఈ సినిమాని ఇతర బాషలలో కూడా మూవీ టీం భారీగా ప్రమోట్ చేసింది.అందుకు ఖర్చు కూడా భారీ గా చేసారు.

కనీసం ఆ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. దీనిని బట్టీ అర్థం అయ్యింది ఏమిటంటే, ఇతర బాషలలో ఒక సినిమా క్లిక్ అవ్వాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. పాపం నాని కి ఆ అదృష్టం లేదనుకుంటా. దసరా సినిమాతో కాకపోయినా భవిష్యత్తులో విడుదల అవ్వబొయ్యే సినెమాలతోనైనా ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.
