Das Ka Dhamki : ఉగాది కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మాస్ కా ధమ్కీ’ చిత్రానికి మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి.దీనితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఇచ్చినట్టే ఈ చిత్రానికి కూడా నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు,సినిమా సూపర్ హిట్ అయిపోతుంది,వసూళ్లు 20 కోట్ల రూపాయిల పైనే ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేసారు.కానీ రెండవ రోజు ఈ చిత్రానికి అన్నీ ప్రాంతహలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
కొన్ని ప్రాంతాలలో అయితే నిన్న ‘రంగమార్తాండ‘ అనే చిత్రం కంటే తక్కువ వసూళ్లు నమోదు చెయ్యడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.మొదటి రోజు ‘రంగమార్తాండ’ సినిమాకి ‘ధమ్కీ’ చిత్రానికి వచ్చిన వసూళ్ళలో పావు శాతం కూడా రాలేదు, కానీ రెండవ రోజు మాత్రం దాదాపుగా ఆ సినిమాని అన్నీ ప్రాంతాలలో దాటేసింది.ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ అంటే ఇదే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు ‘ధమ్కీ’ చిత్రానికి కేవలం కోటి రూపాయిల వసూళ్లు వచ్చాయని, మొదటి రోజు మీద 70 శాతం వసూళ్లు పడిపోయాయి అని అంటున్నారు.ఆలా రెండు రోజులకు కలిపి ఈ చిత్రం 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు.ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు జరిగింది.
అందువల్ల బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అనే సందేహమే అక్కర్లేదని,ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని కచ్చితంగా అందుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.నిర్మాతగా విశ్వక్ సేన్ కి ఎలాంటి నష్టం లేదు కానీ, ఆయన మార్కెట్ వేరే లెవెల్ కి వెళ్లే ఛాన్స్ మాత్రం మరోసారి కోల్పోయినట్టే.ఇదే ట్రెండ్ కొనసాగితే క్లోసింగ్ కలెక్షన్స్ పది కోట్ల రూపాయలకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.