నటీనటులు : విశ్వక్ సేన్, నివేత పేతు రాజ్, రావు రమేష్,హైపర్ ఆది, అజయ్ , అక్షర గౌడా, రోహిణి
డైరెక్టర్ : విశ్వక్ సేన్
సంగీతం : లియోన్ జేమ్స్
బ్యానర్ : విశ్వక్ సేన్ క్రియేషన్స్
Das Ka Dhamki : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దీ కాలం లోనే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన హీరో విశ్వక్ సేన్.మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన ‘ఓరి దేవుడా’ చిత్రం వరకు, ప్రతీ చిత్రం వైవిద్యంగానే ఉంటుంది.ఇతను కేవలం ఒక హీరో మాత్రమే కాదు, మంచి డైరెక్టర్ కూడా.రెండవ చిత్రం ‘ఫలక్ నూమా దాస్’ చిత్రం తో తన దర్శకత్వ ప్రతిభ కూడా చాటుకున్నాడు.మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన డైరెక్టర్ మాత్రమే కాకుండా నిర్మాతగా , హీరో గా మారి చేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నేడు ఘనంగా విడుదలైన ఈ సినిమా కి ఎలా ఉంది..?, విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఏర్పాటు చేసిన అంచనాలను అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :
కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఒక స్టార్ హోటల్ లో పనిచేసే వెయిటర్.పేరుకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా , ఇతని కోరికలు మాత్రం చాలా పెద్దవి.అలా సాగిపోతున్న అతని లైఫ్ లోకి కీర్తి (నివేత థామస్) వస్తుంది.చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయిన కృష్ణ దాస్, ఆమెని దృష్టిని ఆకర్షించడం కోసం కోటీశ్వరుడిగా బిల్డప్ ఇస్తాడు.మరోపక్క సంజయ్ రుద్ర ( విశ్వక్ సేన్) అనే అతను అచ్చు గుద్దినట్టు విశ్వక్ సేన్ లాగానే ఉంటాడు.ఒక పెద్ద ఫార్మా కంపెనీ కి అధినేత, క్యాన్సర్ కి డ్రగ్ ని కనిపెట్టి, ఆ వ్యాధితో ఎవ్వరూ చనిపోకూడదు అనే గొప్ప సంకల్పం తో ఉన్న వ్యక్తికీ ధనుంజయ్ ( అజయ్) అనే వ్యక్తి నుండి ఇబ్బందులు ఎదురు అవుతాయి.అయితే అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల కృష్ణ దాస్ సంజయ్ స్థానం లోకి వస్తాడు.ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే కథ.

విశ్లేషణ :
ఇది వరకు ఇలాంటి కథలతో మన టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు.కానీ కథనం మరియు స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్ గా ఉండేవి సక్సెస్ అయ్యాయి.మిగిలినవి డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమా కూడా అదే కోవకి వస్తుంది.ప్రథమార్థం మొత్తం పర్వాలేదు బాగానే ఉంది అని అనిపించింది.అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు పేలాయి.హీరోయిన్ తో రొటీన్ లవ్ ట్రాక్ అయ్యినప్పటికీ కూడా కమర్షియల్ సినిమా కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు.కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పింది అనే చెప్పాలి.అర్థం పర్థం లేని ట్విస్టులతో ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు విశ్వక్ సేన్.ఇక ఆయన నటన కూడా పర్వాలేదు అనే అనిపించింది.మొదటి మూడు సినిమాల్లో ఎలాంటి యాటిట్యూడ్ ఉండేదో ఈ సినిమాలో కూడా అదే యాటిట్యూడ్ ని చూపించాడు.హీరోయిన్ నివేత థామస్ తన పరిధిమేర పర్వాలేదు అనే రేంజ్ లో చేసింది.రావు రమేష్ రొటీన్ పాత్రనే చేసాడు, పెద్ద కొత్తగా ఏమి లేదు.హైపర్ ఆది పంచులు సినిమాకి ప్రధాన హైలైట్స్ లో ఒకటిగా నిల్చింది.

చివరి మాట :
భారీ అంచనాలు పెట్టుకోకుండా ఎదో ఒక కమర్షియల్ సినిమాని చూడబోతున్నాము అనే ఫీలింగ్ తో వెళ్తే పర్లేదు ఒకసారి చూడొచ్చు.కానీ కొత్తదనం ని ఆశించి మాత్రం థియేటర్ కి వెళ్ళకండి.
రేటింగ్ : 2/5