Das Ka Dhamki యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఇటీవలే పాన్ ఇండియన్ లెవెల్ లో గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.విశ్వక్ సేన్ హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా మరియు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది.చిన్న వయస్సు లోనే ఈ రేంజ్ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని సక్సెస్ సాధించిన ఏకైక హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి.
సక్సెస్ అయితే అందుకున్నాడు కానీ ఆయన అనుకున్న గోల్ కి మాత్రం రీచ్ కాలేకపోయాడు.ఈ సినిమాకి అతను 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నాడు.ఇప్పటి వరకు విశ్వక్ సేన్ చేసిన సినిమాలు అన్నీ పది కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లు సాధించాయి.డబుల్ డిజిట్ షేర్స్ ఇప్పటి వరకు పడలేదు.దాస్ కా ధమ్కీ చిత్రానికి ఆయన ఏకంగా పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు.
అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి వారం లో కేవలం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లే వచ్చాయట.ఇది విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ వసూళ్లే అయ్యినప్పటికీ, వచ్చిన ఓపెనింగ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.మొదటి రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇది మామూలు రేంజ్ ఓపెనింగ్ కాదు, విశ్వక్ సేన్ గత చిత్రం ‘ఓరి దేవుడా’ కి క్లోసింగ్ లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు.
అలాంటిది మొదటి రోజే ఆ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు.అలాంటి ఓపెనింగ్ దక్కించుకున్న సినిమాకి కేవలం వీకెండ్ లోనే 20 కోట్ల రూపాయిల షేర్ ని ఆశించారు ట్రేడ్ పండితులు.కానీ వారం రోజులకు అందులో సగం వచ్చింది.రేపు హీరో నాని నటిస్తున్న ‘దసరా‘ మూవీ విడుదల కాబోతుండడం తో ఇక ‘దాస్ కా ధమ్కీ‘ చిత్రానికి క్లోసింగ్ పడినట్టే అనుకోవచ్చు.