Megastar Chiranjeevi : ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి కి కొంచెం తీపి, కొంచెం చేదు జ్ఞాపకాలను మిగిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది. కానీ ఆగస్టు 11 వ తేదీన విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.

ఆయన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు చూసారు కానీ, భోళా శంకర్ చిత్రం అభిమానులను తల ఎత్తుకోలేకుండా చేసింది. గతం లో చిరంజీవి సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్, ఈ సినిమాకి ఫుల్ రన్ లో వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ కి అర్జెంటు గా ఒక సూపర్ హిట్ కావాలి. అందుకే ఆయన ‘భింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యం లో సాగబోతున్న ఈ సినిమా లో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ఖరారు కాగా మరో హీరోయిన్ కోసం పరిశీలిస్తున్నారు. కూతురి కోసం తండ్రి మూడు లోకాలను చుట్టి వచ్చే కథగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో చిరంజీవిని ముప్పుతిప్పలు పెట్టి చిత్రహింసలకు గురి చేసే విలన్ పాత్రలో దగ్గుపాటి రానా కనిపించబోతున్నట్టు టాక్. రీసెంట్ గానే రానా ని కలిసి స్టోరీ ని, ఆ పాత్ర ని వివరించాడట వశిష్ఠ. ఆ పాత్ర ‘బల్లాల దేవ’ కంటే పవర్ ఫుల్ గా ఉందని, ఈ పాత్ర నేను చేస్తాను అంటూ వశిష్ఠ కి మాటిచ్చాడు అట. మరి రానా కి ఈ పాత్ర ఎంత వరకు సహాయం చేస్తుందో చూడాలి.
