Daggubati Abhiram : సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి పెద్ద కుటుంబాలలో ఒకటి దగ్గుపాటి రామానాయుడు కుటుంబం . నిర్మాతగా ఈయన మన టాలీవుడ్ ఎలాంటి మేలిమి బంగారం లాంటి సినిమాలను అందించాడో మన అందరికీ తెలుసు. అలాంటి దిగ్గజ నిర్మాత కొడుకుగా అడుగుపెట్టిన వెంకటేష్ ,ఎన్నో హిట్లు సూపర్ హిట్లు అందుకొని టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా నాలుగు దశాబ్దాలు కొనసాగాడు.
ఆయన అన్నయ్య సురేష్ బాబు చూసేందుకు అప్పట్లో అందంగా ఉండేవాడు కానీ, ఆయన నటన కంటే ఎక్కువగా నిర్మాణం వైపే ఆసక్తి చూపించాడు. నిర్మాతగా ఆయన కూడా పెద్ద సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన తనయుడిగా వచ్చిన రానా దగ్గుపాటి పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఆయన తమ్ముడు దగ్గుపాటి అభిరాం రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన ‘అహింస’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దగ్గుపాటి అభిరాం తన మొదటి సినిమా ఫలితం తాలూకు అనుభవాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో నా నటన ని చూసి అందరూ ప్రశంసించారు కానీ, సినిమా కమర్షియల్ గా ఆడకపోవడం తో బాగా నిరాశకి గురి అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఆయన తండ్రి సురేష్ బాబు కి నచ్చని పని చెయ్యడం తో అభిరామ్ ని ఇంట్లో నుండి వెళ్లగొట్టేశారని గత కొంత కాలంగా సోషల్ మీడియా లో ఒక రూమర్ వచ్చింది.
ఈ రూమర్ పై ఆయన స్పందిస్తూ ‘తాత చనిపోయిన తర్వాత నాకు జీవితం విలువ ఏంటో తెలిసొచ్చింది. కచ్చితంగా నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి అనే తాపత్రయం తో ‘రైటర్స్ కేఫ్’ ని ప్రారంభించాను. ఇలా చేసినందుకు ఇంట్లో వాళ్ళు నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టేసారు అంటూ సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు దగ్గుపాటి అభిరామ్.