JR NTR ప్రస్తుతం ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన తర్వాతి సినిమా దేవర కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కోట్లాదిమంది అభిమానులు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించే స్థాయిలో అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారు. మధ్యలో ఎన్టీఆర్ సినిమాలకే పరిమితమైపోయి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే జనాలు చాలామందే ఉన్నారు. కారణమేంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు కన్నెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు.
మొదటి నుంచి తారక్ కి రాజకీయాలంటే అంటే చాలా చాలా భయం. అందుకే దూరంగా ఉండేవాడట . కానీ ఒకానొకసారి టీడీపీని ప్రమోట్ చేయడానికి మాత్రం వెలుగులోకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాడు. తాత పార్టీ అన్న మమకారం కారణంగా ప్రమోట్ చేశారు. ఆ టైంలోనే యాక్సిడెంట్ కావడం.. ఆస్పత్రి బెడ్ మీద నుంచి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అప్పటినుంచి పాలిటిక్స్ కి దూరంగా ఉండటం ప్రారంభించారు . ఎంతలా అంటే ఆయనను అభిమానించి అన్నలా ఆరాధించే ఫ్యాన్స్ అడిగినా కూడా తారక్ పాలిటిక్స్ లోకి రావడానికి ఇష్టపడడం లేదు.
ఒక్క విషయం కూడా రాజకీయాల పై స్పందించడం లేదు. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతున్నాడు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్.. అయినా కూడా దాని గురించి ఒక్క విషయం కూడా మాట్లాడడం లేదు. పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. పలానా పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. అసలు రాజకీయాలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. తారక్ అంతే.. మొదటి నుంచి మొండివాడు తాను అనుకున్న పని తాను చేసే తీరుతాడు. ఇష్టముంటే ఎంత దూరమైన వెళ్లే ఎన్టీఆర్ ఇష్టం లేకపోతే ఆ పనిని అస్సలు చేయడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.