టాలీవుడ్ లో నవరసాలు పండించగల నేటి తరం హీరోల లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, కెరీర్ ప్రారంభం లోనే ఎవరీ చిచ్చర పిడుగు, ఇంత అద్భుతంగా నటిస్తున్నాడు అని అందరూ అనుకున్నారు.
అలా కేవలం తన టాలెంట్ తో 18 ఏళ్ళ వయస్సులో రెండేళ్ల నట ప్రస్థానం ఉన్న అనుభవం తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కి మాస్ లో సరిసమానమైన ఫాలోయింగ్ ని సంపాదించాడంటే ఆరోజుల్లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక సినీ సెలబ్రిటీస్ లో కూడా ఎన్టీఆర్ నటన ని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చుతుంది అని ఏ సెలబ్రిటీ ని అయినా అడిగితే నూటికి 99 శాతం ఎన్టీఆర్ పేరే చెప్తారు.
అలా ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడే సెలెబ్రిటీస్ లో ఒకరు కుష్బూ. ఈమె తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు లో ఈమెని ఎంతలా అభిమానించే వారంటే, ఈమె కోసం ఆ రాష్ట్రం మొత్తం దేవాలయాలు ఏర్పాటు చేసారు. ఈమె అంటే వాళ్లకు అప్పట్లో అంత పిచ్చి. అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమాని అట.
ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆమె విషయాన్నీ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘నేను ఎన్టీఆర్ కి వీరాభిమానిని, నా చిరకాల కోరిక ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడం’ అంటూ చెప్పడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. కుష్బూ తన కెరీర్ లో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించింది. అయినా కూడా ఆమెకి ఎన్టీఆర్ మీద అంత ఇష్టం ఏర్పడింది అంటే ఆమె అభిమానం లో ఎంతటి స్వచందనం ఉందొ అర్థం చేసుకోవచ్చు.