Murari4k : ‘మురారి’ థియేటర్ లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట..ఇది తెలుసుకున్న తల్లితండ్రులు ఎం చేసారంటే!

- Advertisement -

Murari Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అల్ టైం క్లాసికల్ గా నిల్చిన చిత్రం మురారి. ప్రతీ హీరో అభిమాని తమ అభిమాన హీరోకి ఇలాంటి కుటుంబ కథా చిత్రం ఉండాలని కోరుకుంటారు. ఆ స్థాయి లో ఈ చిత్రం ప్రభావం చూపించింది. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఈ రీ రిలీజ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రీ రిలీజ్ కి ఉన్నంత క్రేజ్, రీసెంట్ గా విడుదలైన ఏ కొత్త సినిమాకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Watch Murari Full movie Online In HD | Find where to watch it online on Justdial

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రీ రిలీజ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి మహేష్ బాబు స్టార్ స్టేటస్ ఎలాంటిదో అందరికీ మరోసారి అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. క్లాస్ సినిమా కదా పెద్దగా రచ్చ ఏమి చేయగలము అని ముందుగా అభిమానులు కంగారు పడ్డారు. కానీ ఈ సినిమాకి థియేటర్స్ వద్ద అభిమానులు నేడు చేసిన హుంగామ అంతా ఇంతా కాదు. అనేక చోట్ల లేడీ ఫ్యాన్స్ థియేటర్స్ లో మాస్ స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ఒక ప్రముఖ థియేటర్ లో ప్రేమ జంట పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. మూవీ లో ‘అలనాటి రామచంద్రుడు’ అంటూ వచ్చే పాపులర్ పెళ్లి పాట సమయం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

దీంతో థియేటర్ లో ఉన్న అభిమానులు వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఇది చూసిన నెటిజెన్స్ అంతా బాగానే ఉంది కానీ, ఈ ఇద్దరి జంట తల్లితండ్రులకు ఈ విషయం తెలిస్తే పాపం ఏమైపోతారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మురారి చిత్రానికి కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా, రేపు ఎల్లుండి కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నందున పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ మూవీ రీ రిలీజ్ రికార్డు గ్రాస్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

super star mahesh babu Murari Movie new record at re release Pre Bookings ta | Murari Re Release: రీ రిలీజ్ లో మహేష్ బాబు మురారి మూవీ దూకుడు.. సూపర్ స్టార్ మాస్ రచ్చకు బాక్సాఫీస్ షేక్ ..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here