Soundarya : అందం తో పాటు అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో నటించే ఏకైక హీరోయిన్ ఈమెనే అని అందరూ అనేవారు అప్పట్లో. కన్నడ, మలయాళం, తెలుగు మరియు హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, దాదాపుగా అందరి స్టార్ హీరోలను కవర్ చేసిన హీరోయిన్ ఆమె.
దురదృష్టం కొద్దీ ఆమె హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చాలా మంది హీరోయిన్స్ యాక్టింగ్ టాలెంట్ ని నిరూపించుకున్నారు కానీ, సౌందర్య లేని లోటు ని మాత్రం ఎవ్వరూ పూడవలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే ఆమె ఏ రేంజ్ డెడికేషన్ ఉన్న నటినో తెలిస్తే చేతులెత్తి దండం పెడుతారు. ఒక్క అమ్మాయిలో ఇంత సహనం, ఇంత ఓర్పు ఉంటుందా?, అనేది ఈ సంఘటన చూసిన తర్వాతే అర్థం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే సౌందర్య అప్పట్లో కన్నడ లో ఒక స్టార్ హీరో మూవీ చేసిందట. ఆ స్టార్ హీరో కి సంబంధించిన డేట్స్ తక్కువ ఉండడం తో పని ఎక్కువ గంటలు చెయ్యాల్సి వచ్చిందట. డైరెక్టర్ ఒక్కో షాట్ కి పడి టేకులు తక్కువ కాకుండా తీస్తున్నాడు. ఉదయం 7 గంటలకు షూటింగ్ స్పాట్ కి వస్తే, పక్క రోజు ఉదయం పడి గంటల వరకు షూటింగ్ జరిగేది అట.
పగలు పూట నిద్రపోయే అలవాటు లేకపోయేసరికి సౌందర్య ఎంత నిద్రపోవాలని చూసినా నిద్ర పట్టేది కాదట. అప్పుడు సౌందర్య కి నిద్ర లేమి సమస్య ఏర్పడింది అట. ఆ సమయం లో ఆమె నిద్ర పోవడం కోసం తక్కువ మోతాదు లో నిద్ర మాత్రలు వేసుకొని పడుకునేది అట. మళ్ళీ వెంటనే నిద్ర లేచి షూటింగ్ కి వెళ్ళేది అట. అలా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు టార్చర్ ని అనుభవించింది సౌందర్య.