Venu Swamy: సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ నిత్యం వివాదాల్లో ఉండే వేణు స్వామి, ఈసారి చాలా గట్టి సమస్యలను ఎదురుకోబోతున్నాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్స్ ఆయన సతీమణి వీణ శ్రీవాణి రీసెంట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె కూడా ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ నిశ్చితార్థం ని కించపరిచేలా వ్యాఖ్యానించిన వేణు స్వామి ని ఈ నెల 22 వ తారీఖు లోపు మహిళా కమీషన్ కి వచ్చి వివరణ ఇవ్వాలని కమీషన్ డిమాండ్ చేసింది.
లేనిచో వేణు స్వామి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతాం అంటూ వేణు స్వామి కి హెచ్చరికలు జారీ చేసారు. దీంతో సోషల్ మీడియా లో అక్కినేని అభిమానులు వేణు స్వామి అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ సంబరాలు చేసుకున్నారు. మరోపక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా వేణు స్వామి అరెస్ట్ అవ్వబోతున్నట్టుగా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేసాయి. దీనిపై వేణు స్వామి రియాక్ట్ అవుతూ ఒక వీడియో ని విడుదల చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘కొన్ని మీడియా చానెల్స్ నేను అరెస్ట్ అవ్వబోతున్నాను అంటూ ప్రచారాలు చేస్తున్నాయి. వాళ్ళు ఆలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. నేను అరెస్ట్ అవ్వడం లేదు, దయచేసి అలాంటి మాటలు నమ్మకండి. ఒక్క నెల రోజులు గ్యాప్ ఇస్తున్నాను. ఆ తర్వాత వీటి అన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఇక మీదట సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలను చెప్పను అంటూ మొన్న కూడా వీడియో బైట్ విడుదల చేసిన వేణు స్వామి ఇప్పుడు నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం అంటూ కామెంట్ చెయ్యడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే నెల రోజుల తర్వాత మళ్ళీ నీ పాత బుద్ధి చూపిస్తావు అన్నమాట, నువ్వు నిజంగా అరెస్ట్ అయితే మేమంతా సంతోషిస్తాం, నీలాంటి వారి వల్ల పవిత్రమైన జాతక శాస్త్రం భ్రస్టుపడిపోతుంది. ఇలాంటోళ్ళకి శిక్ష పడాల్సిందే అంటూ నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.