Venu Gopal Swamy : ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి అశుభాలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే వ్యక్తి వేణుగోపాల స్వామి. ఇతను చెప్పేవి నిజాలు అని నమ్మే సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారు. ఈయన చేత వాళ్ళు శాంతి పూజలు కూడా చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా, రాజకీయ నాయకులతో కూడా ఈయనకి మంచి సంబంధాలే ఉన్నాయి.

సీఎం జగన్ తో కలిసి కారులో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక ఈయన్ని సోషల్ మీడియా లో ఫాలో అయ్యేవారికి ఇతనికి ఎంత మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఎన్నో వందల సినిమాలకు ఈయన పూజ కార్యక్రమాల్లో పాల్గొని అర్చకుడిగా వ్యవహరించాడు. అంతే కాదు పలు సినిమాల్లో నటించాడట కూడా.

అప్పట్లో జగపతి బాబు మరియు హీరోయిన్ రక్షిత కాంబినేషన్ లో ‘జగపతి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక సన్నివేశం లో వేణు గోపాల స్వామి అర్చకుడిగా కనిపిస్తాడు. ఆయనకీ రెండు డైలాగ్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాతో పాటుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించాడట, కానీ అసలు గుర్తింపు రాలేదు.

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘అతడు’ లో కూడా వేణు గోపాల స్వామి ఒక్క పాటలో కనిపిస్తాడట. ఇన్నిసార్లు ఆ సినిమాని మనం చూసి ఉంటాము, కానీ ఒక్కసారి కూడా ఇది ఎవ్వరూ గమనించలేదు. వేణు గోపాల స్వామి చెప్పేంత వరకు కూడా ఎవరికీ ఆయన సినిమాల్లో నటించాడు అనే విషయమే తెలీదు, ఆ రేంజ్ గుర్తింపు వచ్చింది సినిమాల్లో ఆయనకీ.