రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకుల్లో అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు దళపతి విజయ్. ఆయన సినిమాల కోసం ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో వారసుడు సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం విజయ్ ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఇక ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అవి చూసిన తర్వాత మూవీపై మరింత అంచనాలే నెలకొన్నాయి. అలాగే ఇటీవల విడుదలైన నా రెడీ సాంగ్ కు సైతం భారీ ఆదరణే వస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పాటే విజయ్ ను చిక్కుల్లో పడేసింది. విజయ్ ను మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ మొత్తం మీద కేసు నమోదైంది.
అందుకు కారణం పాటలో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించాడు. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని చూపించాంటూ చెన్నైకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ.సెల్వం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దళపతితోపాటు.. చిత్రబృందంపై ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. వీరిపై నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇటీవలే ఆయన తమిళనాడులోని 10,12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలిశారు.

దాదాపు 12 గంటలు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించడమే కాకుండా.. వారికి ప్రోత్సాహకాలు కూడా అందించాడు. మంచిగా ఉండడమే కాకుండా.. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులు పోత్సాహించాలని సూచించాడు. అలాంటి విజయ్ ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని సదరు వ్యక్తి ఆరోపించాడు. లియో చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయాలని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు.