మన తెలుగు ఇండస్ట్రీ లో ట్యాలెంట్ తో ఆకట్టుకున్న కమెడియన్లు చాలామంది ఉన్నారు. చాలా మంది కమెడియన్లు వారి యొక్క కామెడీ టైమింగ్ తో అందరిని ఎంత గానో ఆకట్టుకున్నారు. మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్లలో సుధాకర్ కూడా ఒకరు సుధాకర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ప్రేక్షకుల్ని ఫుల్లుగా నవ్వించేవారు. తెరపై నవ్వులని పంచి మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేవారు సుధాకర్. కానీ ఇప్పుడు సుధాకర్ వయసు పై పడటంతో ఆరోగ్యం అంత బాలేదు. ఇబ్బంది పడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో దాదాపు 45 ఏళ్ల నుండి కూడా ఆడియన్స్ మనసులని దోచుకుంటూనే ఉన్నారు సుధాకర్. స్టేట్ రౌడీ, కొదమ సింహం, రాజా విక్రమార్క, పవిత్ర ప్రేమ, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు, పెళ్లి పందిరి, సుస్వాగతం, పెళ్లి చేసుకుందాం ఇలా వందలాది సినిమాలో నటించి అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నారు.
చాలామంది టాప్ హీరోల సరసన కనపడి ఎంతగానో ప్రేక్షకులని మెప్పించారు సుధాకర్. ఈ మధ్య సుధాకర్ మీద నకిలీ వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. సుధాకర్ చనిపోయారు అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం కూడా చేశాయి. అయితే ఇదంతా కూడా నకిలీ వార్త అని నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు.. అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
తాజాగా జూన్ 18న ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగు లో నేను నాన్న అనే కార్యక్రమంలో కనపడ్డారు సుధాకర్. వయసు పై పడిపోయింది. డైలాగ్ చెప్పే ప్రయత్నం కాస్త చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని సుధాకర్ కి తన కొడుకు కేకు పెట్టారు. అబ్బబ్బ అని తన డైలాగ్ తో అందరిని నవ్వించారు. సుధాకర్ కి ఇప్పుడు 64 ఏళ్లు. ఆయన ఆనందంగా ఉండాలని కోరుకుందాం.