నేను హిందువు అయినా.. నా కొడుకుని క్రిస్టియన్ గా మారమని చెప్పడానికి కారణం అదే : కమెడియన్ సుధాకర్

- Advertisement -

తమిళం లో హీరో గా గొప్పగా రాణించి ఆ తర్వాత తెలుగు లో కూడా పలు సినిమాల్లో హీరో గా నటించి, అవి పెద్దగా సక్సెస్ కాకపోవడం తో కమెడియన్ గా మారి ఎన్నో వందల సినిమాల్లో నటించిన నటుడు సుధాకర్. ఈయన బాడీ లాంగ్వేజ్ మరియు కామెడీ టైమింగ్ తో పెద్దగా కంటెంట్ లేని సన్నివేశాలకు కూడా నవ్వు రప్పించగలడు. అలాంటి కమెడియన్స్ మన టాలీవుడ్ లో చాలా అరుదుగా ఉంటారు, వారిలో ఒక్కరే సుధాకర్.

కమెడియన్ సుధాకర్
కమెడియన్ సుధాకర్

తన గొంతు వింటేనే ప్రేక్షకులు నవ్వేస్తారు, అంత టాలెంట్ ఉంది ఆయనకీ. సుమారుగా 700 కి పైగా సినిమాల్లో నటించిన ఆయన అకస్మాత్తుగా సినిమాల్లో నటించడం మానేసాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ, పెద్దగా కలిసి రాలేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ అసలు గుర్తే పట్టని రేంజ్ లో మారిపోయాడు సుధాకర్.

Comedian Sudhakar

ఒకప్పుడు కోట్లాది మంది అభిమానులను కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ ని ఇలాంటి పరిస్థితి లో చూడలేకపోతున్నామని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ప్రారంభించాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తన కొడుకు బెన్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేసాడు.

- Advertisement -
Comedian Sudhakar Comments

ఆయన మాట్లాడుతూ ‘ పెళ్ళై చాలా కాలం వరకు నాకు పిల్లలు పుట్టకపోయేసరికి మొక్కని దేవుడు లేదు, చెయ్యని పూజ లేదు. అలాంటి సమయం లో ఒకరోజు మేము చర్చి లో సంతానం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించాము. ఆ ప్రార్థనలు చేయించిన వారం రోజులకే కొడుకు పుట్టాడు. వాడిని ఆ యేసు ప్రభువు ప్రసాదం గా భావించి బెనెడిక్ మైఖేల్ (బెన్నీ) అని పేరు పెట్టాను. వాడు పుట్టిన తర్వాత నేను కూడా క్రైస్తవ మతం లోకి మారాను’ అంటూ చెప్పుకొచ్చాడు సుధాకర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here