Hyper Aadi : బుల్లితెర బిగ్గెస్ కామెడీ షో జబర్దస్త్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మందికి లైఫ్ అందించింది. అలాంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకరు. తను స్టేజీ మీదకు వచ్చాడంటే పంచ్ లతో నవ్వుల వర్షం కురిపిస్తుంటాడు. గత పదేళ్లుగా జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇటు బుల్లితెర, అటు వెండితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఆది వేసే డబుల్ మీనింగ్ పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఈ షో తో ద్వారా ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఆది పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. రీసెంట్‌గా తెరకెక్కిన విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో ఈ కమెడియన్ ముఖ్య పాత్రలో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. నటన పరంగా ఎంత గుర్తింపు తెచ్చుకుంటునప్పటికీ ఆది పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఫ్యాన్స్ తమ అభిమాన కమెడియన్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్ నరేష్.. ఆదిపై షాకింగ్ పంచ్ విసిరాడు.
‘‘ఏయ్ తమ్ముడు.. ఏయ్ తమ్ముడు అంటూ హైపర్ ఆదిని పిలుస్తాడు. రేయ్ నేను నీకు తమ్ముడేంట్రా. నువ్వే నాకు తమ్ముడివిరా అనగా.. ఒకే అన్నా.. నువ్వు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావ్ అని అడుగుతాడు. ఓ మంచి తండ్రిని కావాలనుకుంటున్నానని ఆది వెంటనే బదులిస్తాడు. దీంతో నరేష్.. నువ్వు ఫాదర్ ఏంటన్నా స్టెప్ ఫాదర్ వు అవుతావు కానీ.. నవ్వుతూ ఓ పంచ్ వేస్తాడు. దీంతో ఒక్కసారిగా షో లో నవ్వులు పూస్తాయి. హైపర్ ఆది ఫేస్ మాత్రం వాడిపోతుంది.
హైపర్ ఆది పెళ్లై పిల్లలున్న మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడనే అర్థంలో నరేష్ వేసిన పంచ్ లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దానికి జనాలు ఆశ్యర్యపోతూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.