Colors Swathi పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టీవీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేసి..సినిమాల్లో హీరోయిన్‌గా, హీరోయిన్ సపోర్ట్ క్యారెక్టర్‌లు చేసిన కలర్స్ స్వాతి వైవాహిక జీవితానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.. తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. గతంలో ఇలానే వార్తలు వినిపించాయి.. అవి కేవలం పూకార్లే అని తేలింది.. ఇప్పుడు మరోసారి ఇలా..

స్వాతి యాంకర్ గా చేసి దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న కలర్స్ స్వాతి ..ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ అందరికి కొత్త అనుమానాలు రావడానికి కారణమైంది.. ఈమె 2018లో వికాస్ వాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్త జాబ్ రిత్యా సినిమాలకు దూరమై విదేశాల్లో కాపురం పెట్టింది. ఆ టైమ్‌లో తన అప్‌డేట్స్, ఫ్యామిలీ జర్నీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది స్వాతి..
ఈమధ్యే ఈమె తిరిగి ఇండియాకు వచ్చేసింది.. తెలుగులో పంచతంత్ర మూవీలో కూడా యాక్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త వికాస్ వాసు ఫోటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి పెళ్లి వ్యవహారం విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని .. అందుకే ఆమె ఇండియాకు వచ్చిందని ఈక్రమంలోనే డైవర్స్ కూడా తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..స్వాతి తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో భర్త వికాస్ వాసు ఫోటోలు తొలగించడం, భర్తను వదిలి ఇండియాకు వచ్చి సినిమాలు చేయడంతో వాళ్లిద్దరూ విడిపోతున్నారా ఏంటీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు..అయితే కలర్స్ స్వాతి డైవర్స్ వార్తలకు సంబంధించి అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోవడంతో పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్లు.. మరి స్వాతి ఎటువంటి సమాధానం చెబుతుందో చూడాలి..