Bubble gum : టీవీ యాంకర్ సుమ మరియు సినీ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘బబుల్ గమ్’. సుమారుగా నెల రోజుల నుండి నాన్ స్టాప్ ప్రొమోషన్స్ తో అదరగొట్టిన బబుల్ గమ్ టీం రేసెంమ్ట్ గానే విడుదలై మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. కానీ వసూళ్లు మాత్రం రావడం లేదు. కనీసం ఓపెనింగ్ అయినా వస్తుంది అనుకుంటే ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విచారించాల్సిన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి జరిగిన ప్రమోషన్ ఖర్చులు అంతకంటే ఎక్కువ ఉంటాయి. పాపం సుమ తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, అన్నీ మార్గాల్లో ప్రయత్నం చేసింది. ఆడియన్స్ కి రోషన్ ముఖం తెలిసేలా చేసింది కానీ, థియేటర్స్ వైపు వచ్చేలా మాత్రం చెయ్యలేకపోయింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సుమ మరియు రాజీవ్ కనకాల లాంటి సెలబ్రిటీస్ కొడుకు అవ్వడం తో బయ్యర్స్ కూడా ధైర్యం చేసి కొనేశారు. దానికి తోడు ‘క్షణం’ మరియు ‘కృష్ణ అండ్ హిస్ లీల’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం తో కచ్చితంగా ఓపెనింగ్స్ వస్తుంది అనే ధైర్యం తోనే బిజినెస్ చేసారు.
కానీ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ చిత్రానికి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలాగా కూడా కనిపించడం లేదు. అంటే దాదాపుగా 90 శాతం నష్టాలు అన్నమాట. సినిమాకి మంచి టాక్ ఉంది, హీరో బాగా చేసాడు అని రివ్యూస్ వచ్చినా కూడా ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం రోషన్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.