Muta Mestri : మెగాస్టార్ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ముఠామేస్త్రి ఒకటి. 1993లో రిలీజైన ఈ సినిమాని సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసాడు. మార్కెట్ యార్డ్ లో పని చేసే ముఠాకి నాయకుడిగా చిరంజీవి ఈ సినిమాలో సెన్సేషనల్ మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెగా అభిమానులని ముఠామేస్త్రి సినిమాలోని సాంగ్స్ ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా “ఈ పేటకి నేనే మేస్త్రి” సాంగ్ యూత్ ని ఊపేసింది. ఎన్నో స్టేజ్ షోస్ లో ఎన్నో ఏళ్ల పాటు ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ వినిపించింది. మీనా-చిరు మధ్య సీన్స్ బీ, సీ సెంటర్ ఆడియన్స్ ని ఆకర్షించింది. ఈ సినిమాతో చిరు ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ముఠామేస్త్రి నుంచి పొలిటికల్ లీడర్ అయ్యే వరకూ ఉండే హీరో గ్రాఫ్ సూపర్బ్ గా ఉంటుంది.

ముఠామేస్త్రి క్లైమాక్స్ లో కోర్ట్ సీన్ ఉంటుంది, సినిమా స్థాయినే పెంచిన ఈ సీన్ థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. నమాజ్ చేయని సమయంలో… నమాజ్ చేసినట్లు వీడియో రికార్డ్ ఎలా వచ్చింది అంటూ చిరు చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ “భలే లాజిక్ పట్టుకున్నాడు రా” అంటూ ఈలలు వేసారు. ఆ రేంజులో ఆడియన్స్ ని మెప్పించిన ఈ కోర్ట్ సీన్ ఒక కొరియన్ సినిమాకి కాపీ అనే మాట… చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.
అయితే అది ఏ కొరియన్ సినిమా? దేని నుంచి కోర్ట్ సీన్ ని తెలుగు నేటివిటీకి చేంజ్ చేసారు అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. ముఠామేస్త్రి దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఏ రోజు మాట్లాడలేదు కూడా. కథని రాసిన భూపతి రాజాకి మాత్రమే ఈ విషయంలో క్లారిటీ ఉండే అవకాశం ఉంది. మేకర్స్ కి కాకుండా ఇంకొకరికి ముఠామేస్త్రి సినిమాలోని కోర్ట్ సీన్ ఏ సినిమాలోనిది అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు.