Viswambhara గత ఏడాది ఒక హిట్టు, ఒక ఫట్టు తో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు డిఫరెంట్ అనుభూతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన మెగాస్టార్, అదే ఏడాది లో భోళా శంకర్ సినిమాతో కెరీర్ మొత్తం మీద ఎన్నడూ చూడని రేంజ్ ఫ్లాప్ ని చూసాడు.

హీరోలందరూ కొత్తరకమైన జానర్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపుతుంటే చిరంజీవి మాత్రం ఎప్పుడో ఆరేళ్ళ క్రితం విడుదలైన సినిమాని రీమేక్ చేసి అభిమానులను చావగొడుతున్నాడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ బాధని విని చిరంజీవి అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు. అందుకే ఈసారి ఆయన పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.

‘బింభిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో గత కొంతకాలం క్రితమే ఒక సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నేడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

ఈ టైటిల్ టీజర్ ని చూసిన అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. అద్భుతమైన మేకింగ్ క్వాలిటీ తో, సినిమా కాన్సెప్ట్ ని తెలియచేసేలా ఉన్న ఈ వీడియో ని చూసిన తర్వాత అభిమానుల్లో ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మెగాస్టార్ నుండి మేము ఆశించేది ఇలాంటి సినిమాల కోసమే కదా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope – 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫#Mega156 is #Vishwambhara ❤️🔥
— UV Creations (@UV_Creations) January 15, 2024
Title and concept video out now!
– https://t.co/BkWH5NqZ81
In cinemas Sankranthi 2025.
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/NFsXoM0If7